పుట:కాశీమజిలీకథలు-12.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రిపుంజయుని కథ

13

కాదేని నాకీ నియమరహితంబగు రాజ్యంబుతో బనిలేదు అని నిర్మొగమాటంబునఁ బలుకు వానిమాటల కాపలుకులయెకిమీఁడులికిపడుచు నిట్లనియె.

భూమియందుఁగల సర్వపుణ్యతీర్థంబులయందును బృందారక సందోహం బుతో నయ్యిందుధర ముకుందముఖ్యులు బ్రఖ్యాతిగ నివసించియుండిరి అందు నానందకాననం బనంబరగు కాశీయందుఁ బరమానందము నన్ను నంబికానాధునిఁ దక్కుఁగల దేవతాసమూహంబుతో వెడలిపొమ్మనిన నుమ్మలికంబు జెందకుండునా ? ఇత్తెఱంగెల్ల నామృత్యుంజయున కెరింగించి వాని నొప్పించుట యుక్తమని చెప్పుచు నప్పుడే వానితో వారణాసికింబోయి యా దేవోత్తమున కావృత్తాంతము నివేదించెను. ఆ మాటలు విని నిటలాక్షుండు కటకటంబడుచుఁ దామర చూలితో నిట్లనియె.

పరమేష్ఠీ ! లోకహితంబుపొందె నీవు చేసిన యేర్పాటునకు నే నెదురాడ లేను గాని యీ కాశీక్షేత్రంబును విడిచిపెట్టవలయునన్న మాట ములికివలె నాయెడద గాటముగ నాటుచున్నది.


సీ. ధర్మంబు కాశికా స్థానమధ్యంబున
           నాల్గు పాదంబుల నడచియాడు
    నర్దంబు కాశీపురాంగణంబున యందు
           నానా ప్రకారమై లీనుమిగలు
    గామంబు కాశికా కటకఘంటా లీధి
           గర్వించు రాజలోకంబులేప
    మోక్ష సంపదలు కాశీక్షేత్రమునయందుఁ
          బ్రవ్వితండంబులై నివ్వటిల్లుఁ.

గీ. గాశి కళ్యాణమున కాదికారణంబు
    కాశియణిమాది సిద్ధుల కట్టుపట్టు
    కాశి జనలోక సంకల్ప కల్పవల్లి
    కలుష పిశితంబు మెసవు రాకాసికాశి.

సీ. ఉర్వీధరశ్రేణు లుఱ్రాతలూగంగ
           వేఁడు గాడ్పులు వీచు నెన్నఁడేని
    చండభానుండ పండ్రెండు మూర్తులుదాల్చి
           యెనఁగి యెండలు గాయు నెన్నఁడేని
    పుష్కలావర్త కాంభోధరవ్రాతంబు
           లెలగోలు వర్షించు నెన్నఁడేని
    భూర్భువ స్వర్లోకములు ముంచి జలరాసు
           లే కోదకముజూపు నెన్నఁడేని.