పుట:కాశీమజిలీకథలు-05.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

87

నది యుక్తమని తోచినయెడల నహంకార మమకారములు విడిచెద ననుటయు శంకరుం డిట్లనియె. గృహమేధీ? జైమినిముని పరబ్రహ్మయం దభిప్రాయము గలవాఁడైనను విషయసుఖప్రసక్తిచిత్తునకుఁ దద్గ్రహణసామర్ధ్యము గలుగనేరదని యాలోచించి తదధికారము వారికిఁ గలుగజేయుతలంపుతోఁ బరబ్రహ్మప్రాప్తి సాధనమగుటచేతఁ గేవలము పుణ్యమును గర్మాతిశయముచేత నిరూపించెను సుమీ! అది యె ట్టెఱింగితి వంటేని వినుము. శ్రు॥ తమేతం వేదానువచనేన బ్రాహ్మణావివిడిషంతియజ్ఞేన దానేనతపసానాశ కేన॥ అను వేదవాక్యము బోధోత్పత్తికిఁ గారణమగుటచే బ్రహ్మచర్యాదిధర్మసముదాయము చేయుమని చెప్పుచున్నది. తద్వచనాపేక్షచేతనే బ్రహ్మనిరతుండైన జైమినిముని కర్మనిచయమును జేయుమని నిశ్చయించెను. ఇదియే తదీయాభిప్రాయము. మరి యొకటి కాదని మేము నిశ్చయించితిమి అనుటయు మండనుం డిట్లనియె. సూ॥ అమ్నాయ్య క్రియార్థత్వానర్ధక్యమత దర్ధానాం అనగాఁ శ్రుతులు క్రియార్దకములగుట సఫలములైనవి. అక్రియార్థకములైన వాక్యము నిరర్థకములు అని సూత్రము రచించిన జైమినిముని వేదవాక్యములు సిద్ధవస్తుపరమైనవని యెట్లుగాఁ దలంచెడినో సందియముగా నున్నదనుటయు భాష్యకర్త వెండియు నిట్లనియె.

పండితప్రవరా! నిగమరాశిపరంపరచే నద్వితీయబ్రహ్మయం దాసక్తి గలదైనను ఆత్మబోధయే ఫలముగాఁగల కర్మయందు దృష్టి వ్యాపింపఁజేయుచుఁ దత్కర్మప్రకరణవాక్యములయొక్క కార్యపరత్వమును సూచన జేసె ననిన మండనుండు, ఆర్యా! సకలవేదకదంబమునకు సచ్చిదాత్మపరత్వముకలదని జైమినిముని యభిప్రాయము పడినచోఁ బరమాత్మభిన్నమగు కర్మకు ఫలదాతృత్వము జెప్పుచు, బరమేశ్వరు నేమిటికి నిరసించునో చెప్పుఁడు. ఈ జగము కర్తృపూర్వకమగుటచే ఘటాదికము వంటిదియని యనియెడు ననుమానమే వేదవాక్యముతోఁ బనిలేకయే బరమేశ్వరునిఁ బ్రకటనఁ జేయుచున్నది. శ్రుతు లనువాదమాత్రములే సుమీ యని కాణాదుల పలుకఁగా నుపనిషేదికగమ్యుండును బూర్ణుండు నగు పరమపురుషుని వేదవేత్త కానివాఁడు దెలిసికొనజాలడు. అని వేదవచనములు పరమాత్మును వేదగోచరుడని జెప్పుచున్నవే మీ యనుమాన మెట్లుగాఁ దెలిసికొనగలడని బంధురములైన యుక్తిశతములచే నీశ్వరపరమగు ననుమానమును నిరాకరించుచు నయ్యీశ్వరునివలన జగత్తు పుట్టుటయు లయము నొందుటయు లేదనియు ఫలము గలుగుటయు లేదని నిరాకరించెను. కాని వేదోక్తమగు పరబ్రహ్మ విషయముకాదు. కావున జైమినిముని వాక్యమం దింతకంటె నణుమాత్రమును విరుద్ధములేదు. ఇట్టి తద్భావరహస్యమునుఁ దెలిసికొనఁజాలక బుధు లమ్మహాత్ముని నిరీశవాదియని పలుకుచుందురు.

పరమేశ్వరపరమగు ననుమానమును ఖండించినంతమాత్రముననే బ్రహ్మవిద్వరేణ్యుండైన జైమినిముని నిరీశవాదియగునా? మేచకాదులవలనం గలిగిన చీఁకటి