పుట:కాశీమజిలీకథలు-05.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

కాశీమజిలీకథలు - ఐదవభాగము

పద్మపాదుండట్టి శివగంగ మునింగి గౌరీనాధు నారాధించి తాండవము జూచి పరమానందము నొందెను. పదంపడి శ్రీరంగమున కరిగెను.

క. శ్రీరంగపతింగావే
   రీరంగద్భంగపవన తృప్తమతిమనం
   బారంగఁ గొలిచె సుకృతము
   మీరంగొన్నాళ్ళు యతి సమీహితభక్తిన్.

అట్లు దక్షిణ యాత్రలన్నియు గ్రమంబున సేవింపుచు బద్మపాదుండొక నాడు దారి దారసిల్లిన మేనమామ యింటికిం జనుటయు నతండు పరమానందము జెందుచు భాగినేయుని శిష్యయుక్తముగా నర్చించి నానా ధోపచారములచే నతనికి సంతోషము గలుగజేసెను.

అప్పు డవ్వార్త నాలించి యందుగల బంధువులందరు సందోహముగా జనుదెంచి ప్రేమానుబంధపూర్వకముగా నాలింగనాది కృతంబు లొనరించి,

శా. అన్నా ! నీ విటకుంజిరాగతుడవైతంచుం బ్రమోదంబుతో
    నిన్నుంజూడగ వచ్చినారముగదా నీ వెన్న సంసార దు
    స్సాన్నాహంబుల నెల్లఁ ద్రెంచి పరమాచ్చస్థానస స్థాయివై
    చెన్నారన్సుఖియింపుచుంటివిఁక మా స్నేహంబు నిన్నంటునే.

గీ. లేదుగద నీకుదారసుతాదిబంధు
   గతవిషాదంబు గలుగదు గద నృపాల
   బాధ తస్క రభీతి యెప్పటికి నహహ
   కనఁగ నీ వంటిసౌఖ్య మెక్కడిది మాకు.

చ. అనఘ కుటుంబరక్షణ సమాప్తమనీషులమై సదా ధనా
    ర్జనగితి నొప్పి యించుకయు సౌఖ్యముగానక నిద్రజెంద కి
    ల్లను పెనునూతిలోనఁ బడియారటమందెడు మాకు దేవతా
    ర్ఛనయును దీర్తయాత్రలును సజ్జనసేవయుఁ గల్గనేర్చునే.

క. నిను సన్యాసకృతునిఁగా
   వినినారము పూర్వమొక్క విప్రునివలనన్
   గనుఁగొనఁగోరుదు మిప్పుడు
   కనఁబడితివి తీర్థయాత్ర కతమున మాకున్.

గీ. పరులచే బెంపఁబడినట్టి పాదపములు
   తావులుగఁ జేసికొను శకుంతములభాతి