పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

482

కళాపూర్ణోదయము.


గీ. వరణరణ కొతు కాకుల స్వర్ణయువతి
జనకటాక్ష నిరీ-నుసరణవశత
నిద్ద కౌ క్షేయకద్యుతు లినుమడింప
బోరి రప్పుడు వార లద్భుతముగాఁగ68

క. ఆయెడ యాత్రాచంగుని
యాయుద్ధముఁ జూచి మొత్త మై గౌడమహీ
నాయకుదండకు విజయా
శాయ త్తతఁ దిరుగఁ జేరె నతనిబలంబుల్ . 69

సీ. అమ్మహాయుద్ధంబు నట్లు ఘోరతఁ బ్రవ
లఁ గళాపూర్ణుండు తీవ్రగతిని
గడుఁ జిత్రహ స్తలాఘవముఁ జూపుచును ద
త్రైథిలోపల నాత్మరక్షయందు
నించు కేమఱుట దోఁపించి వేటున కౌస
యిచ్చిన వేయ వాఁ డెత్తినట్టి
బలువాలు నారౌతు పల్లంబు నశ్వంబు
నెనిమిదితునుక లై యిలఁ బడంగ

గీ. వేసె నేటవాలుగ నొక్క వేటునన గ
భీరరయమున నసిధారఁ బెడమరల్చి
కలన వేటాఱుతునియలు గాఁగ వేయు
బిరుదురౌతుల వార్తలు బెండుపడఁగ.70