పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

414

కళాపూర్ణోదయము


 
శత్రుశరవృష్టి గాదు రా సామికాన
స వ్వెఱుఁగ వుగ్ర మని నవ్వె నర్మసఖుఁడు.72

ఉ. శ్రీలు దలిర్ప భూరమణ శేఖరు నిట్లు మదాశయుం డెదు
ర్కో లొనరించి తెచ్చి మణికోమలపీఠిక నుంచి కూర్శియి
ల్లాలు పసిండిగిండిగొని యాదటఁ దోయమువోయఁగాఁ బద
Eళనమాచరించి వరుసం జలిపె న్మధుపర్క ముఖ్యముల్

మ• క్రమ మొప్పారఁగఁ బెండ్లి పెద్ద లిరువంకన్వర్తిలంగాఁ బ్రగ
ల్బమనీషం బ్రథమాగముండు తమితో లగ్నాష్టకంబుల్ పఠిం
చి మనోజ్ఞం బగులగ్న వేళ భుజముల్సేర్పించె శాస్త్ర స్థితిని
విమల శ్రీల మదాశయాత్మజకు నూణి స్తంబకిం బ్రేమతోన్

శ. మంగళసూత్రముఁ గట్టెఁ గు
రంగాడికి నంత నంగరా జేంద్రుఁడు పు
ణ్యాంగనల పెండ్లి పాటలు
మంగలికోళ్లమృదుగీతిమధురిమ నెనయన్.75

సీ. ఇరువుకఁ జెలు లెత్తులిడుచు నుబ్బింపంగఁ
జిఱునవ్వులో ( గొంతసిగ్గు వదలి
ఘనతరం బగుగుబ్బచనుదోయి మీఁది కెం
తయు మిటారింప హ స్తంబు లెత్తి
కడుఁ దీఁగ సాగుచు బడుగు నెన్న డుము మి
క్కిలిఁ గృశంబుగఁ దత్తజిలుచు నిక్కి