పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

407

సప్తమాశ్వాసము


సీ తళుకుఁబిల్లాంక్లు బొబ్బిలికాయలును మట్టి
యలు వీరముద్దెలు నందియలును
మొలనూళ్లు నొడ్డాణమును నేవళంబుఁ బుం
జాలదండయుఁ బన్న సరము మొగపుఁ
దీఁ గెయు నాణేము తైపుఁ బేర్లు సందిదం
డలు సూడిగములు గౌడసరములును
గడియాలుఁ బెక్కు జోకలయుంగరములు ముం
గరయుఁ గోలాటం పుఁగమ్మజోడు

గీ. చెవుల పూవులు బహిరలు చేరుచుక్క
కొప్పువలయును సవరించి గొప్పు మోజు
భూషణములకుఁ దా నొక భూషణ మయి
పడతి యపు డొప్పెఁ గన్ను లపండు వగుచు.66

సీ. ఇట్లు కెసేసి యాయింతులు తజ్జన
యిత్రిని బిల్చి నీ పుత్రిసొబగు
లెస్సగాఁ జూడు మో లేమ మాచూ పొక
లాగు నీచూ పొకలాగు నీవు
రూపానుభూతి నా రూఢి కెక్కినదాన
వెవ్వరు నీ పాటి యెఱుఁగ లేరు
రూపవిశేషంబు రూపింప ననుడు నా
కొమ్మ నవ్వుచు నటు గొంత యెడగ