పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

391

సప్తమాశ్వాసము




గీ. అనుఁగుఁ జెలికాఁడ యొకటి ని న్న డిగి తెలియ
వలయు నని యుండుదును నీవు వచ్చి యున్న
యప్పుడది యేమి యడిగెద ననుచు విడుతు
నడుగకుండినఁ బో దింక ననుచుఁ బలికె.6

చ. మననగరంబుతూర్పుకడ మంజులరత్న వినూత్న కాంతితో
ననయము నొప్పునట్టివి మదాశయునుప్పరిగల్ గదా తదీ
యనవసువర్ణసాలముల కవ్వల నున్న ది నిత్య సాంద్రనూ
తనకుసుమప్రవాళలలితం బొక కేళివనం బెఱుంగుదే.7

క. ఇటము న్నొక నాఁ డే న
చ్చటి కరిగితి వేఁట డేగ చనినఁ బిలుచుచుం
గుటిలాలక నొక తెను ముం
దటఁ గాంచితి నందు చెలులుఁ దాను జరింపన్.8

ఉ. ఆలలి తాంగిరూపుపస యారసి చూడఁగ నెన్ని యాత్మలుం
జాలవు దానిసర్వగుణసంపద లెన్న (గ నెన్ని జిహ్వలుం
జాలవు తద్విలోక నర సస్థితిఁ జొక్కఁగ నెన్ని కన్ను లుం
జాలవు వేయు నేల యది చక్కదనంబుల రాశి భూసురా.9

క. ఎక్కడియుపమాకల్పన
లెక్కడియత్యు క్తి రచన లెక్క డిమతినే
ర్వెక్కడివర్లన లెక్కడి
వెక్కడ వాజ్మతుల కంద వింతి బెడంగుల్.10