పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

కళాపూర్ణోదయము



న్నగుఁ బదు నాల్గు శ్రేష్ఠుబు లందులోన
మూఁడు నుతి కెక్కు నందును ముఖ్య మొకటి.172

ప. పదునాల్గు నాడులలోపల సరస్వతీ ప్రముఖంబు లేని యేకా
దశనాడులు జిహ్వాది వ్యాపార కారణంబు లై పరఁగు నిడా
పింగళ లను నాడీద్వయంబు వామదక్షిణ నాసారంధ్రగామి
యగుచుఁ బ్రాణాయామ సాధనం బై ప్రవర్తించుఁ బ్రధానత
ము బైససుషుమ్నాహ్వయనాడి బ్రహనాడియనం బరఁగు
చు నాడీకందమధ్యవర్తిని యై బ్రహ్మగంధ్రగామిని యైయుం
డు నందు పవనుబుఁ బ్రవేశింపఁ జేయుట యుత్తమయోగం
బనం బరఁగు నింకఁ బ్రత్యాహారప్రకారంబులు వినుమని యి
ట్లనియె.173

సీ. ఇంద్రియార్థములుదు నింద్రియులఁ బ్రవ
రైలనీక కుదియించి త్రిప్పు టొకటి
యవి యెందుఁ జరియించె నది సమ స్తంబు నా
త్మయ కాఁగ మనసులోఁ దలఁచు టొకటి
నిత్యకర్మంబు లన్నియు నాత్మయంద సం
తతము చిత్తముచే నొనర్చు టొకటి తనువునం గలపను నెనిమి ది మర్మసీ

మలఁ గ్రమంబుస గాడ్పునిలుపు టొకటి

ఆ. యోగ శాస్త్రశీలయుతులు ప్రత్యాహార
భేద రీతు లనుచు నాదరమున