పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154 కళాపూర్ణోదయము.


X. మునుపటి భయమున మ్రాన్పడి
యునికి నపుడు చేతిక ఆయును దనదుశిరం
బును విడువఁగ నెఱుఁగనిననుఁ
గనుఁగొని నెమ్మేను మిగుల గడగడ వడఁకన్.

సీ. అమృతంబు దొలఁకున ట్లమరంగ వెల్వెలం
బొజుము ఫేందుబింబంబుతోడఁ
జాలఁ గర్ణద్వయీకూలంకషంబు లై
తల్లడం బందు నేత్రములతోడఁ
గడుఁ జెమల్చినయట్టికలికి లేఁ జెక్కుల
నం టెడువిగళత్కచాళితోడ
వలిగుబ్బ పాలిండ్ల నిలువ కి టట్టు సం
షోభించుపయ్యెదకొంగుతోడ

గీ. వెఱపు నొక యొజ్జయై వింతవిలసనములు
గజపఁ జూపట్టుసౌందర్యగరిమతోడ
సరభసాకర్షణాడోభచిత యైన
మదనుజయలక్ష్మిలీల నిమ్మగువ దనర .

క. కనుఁగొంటీం గనుఁగొనునం
తన మన్మథవశుఁడ నగుచుఁ దగఁ బరిరంభం
బును గావించితి నేఁ జే
సినపాపముఁ జెప్పవలయు శీతాంశుముఖీ.