పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

కళాపూర్ణోదయము

    దాలుచు టెట్లొకొమింటన్
    లీలాహరిఁ దోల నింత నేర్పరి యయ్యున్ •78

క. ఎక్కడ దొరకెనొకో యీ
   చొక్కపుగుబ్బెత వెడంగుజోగికి సహహా
   యిక్కలికి గుత్తగొనుఁ బో
   తక్కక దివి నిమిష మున్న దైవతవిటులన్ .79

వ. అని చెప్పికొని రంత.80

క. నలకూబరుండు రంభం
    గలయుట విని చిన్నవోవుకలభాషిణిరీ
    తులు దిరిగి చూచి దీన్ని
    గలఁచెర యివ్వార్త తాపకరమై యనుచున్.81

ఉ. సిద్ధుఁడు నవ్వియోచెలువ చితిలఁగావల దిప్పు డెంతయున్
    బుద్ధి దిరంబు గాగ ధృతిఁబూను మొకించుకసేపులోన నే
    శుద్ధముగాగ నీమనము శోకము సర్వముఁ బుచ్చి వైచెదన్
    సిద్ధము నాదుపల్కులనఁ జెల్వయుమోమువికాసమందఁగన్

క. ఏరీతి వింత మిక్కిలి
    చేరికగా నాడి తనియె సిద్ధుఁడు చూడం
    గారాదె కుడువఁబోవుచుఁ
    గూరలచవు లకుగ నేల కోమలి యనియెన్ .