పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

105

ద్వితీయాశ్వాసము

క. కలభాషిణి యి ట్లను నీ
   తలఁపున కెట్లు సరిదాఁకెఁ దథ్యము చెపు మో
   చిలుక మును పెచట నుండుదు
   తలపోయఁగ నీవు చతురతరమతివి కడున్. 169

సీ. అనుడు నాపక్షి యి ట్లనియె నోపూఁబోఁడి
                     నానివాసంబు నందనవనంబు
   వనజాక్షుడిచటికి మును పారిజాతంబు
                     దెచ్చుచోఁ దత్పక్షు లిచ్చ గలిగి
   మరలి పాఱుచునుండ మద్భార్య యవ్వేళఁ
                     బ్రసవార్త యైయున్కి బఱవలేక
   యె ట్లైన నయ్యె నే నిచటన యుండెద
                     నని యొక్కతొఱ్ఱలో నడఁగియుండె

గీ. వెనుకఁ దోడ్కొని పోవ నా కనువుపడదు
   పిల్ల లీఁకలు వచ్చి వర్ధిల్లుదాక
   నంతఁ బలుమాఱు వచ్చి రమ్మనుచు మిగుల
   నెత్తు లిడియెడునన్ను నాయింతి చూచి. 170

క. ఈభవ్యోద్యానంబుల
   సౌభాగ్యముగతిని మానసమునకుఁ గడు నిం
   పై భాసిల్లదు నందన
   వైభవమం దెట్లు ప్రేమ వదలదొ నీకున్. 171