పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

కళాపూర్ణోదయము



గీ. నుల్లమునకును జూడ్కికి వెల్లిగొలుపు
   నావరదుమోమునందు మనంబుఁ జేర్తు
   ననుచు గీతరూపములుగా నాశుకవిత
   నుతుల రచియించి పాడుచు నతఁడు గొలిచె 154

వ. అంత నాగంధర్వుఁ డచ్చటు వాసి యొక్కించుక తూర్పుగాఁ జని చని.155

చ. అలరుచుఁ గాంచె ముందట నహమ్మతినిర్మధన ప్రవీణమున్
    విలసితసౌధవజ్రరుచినిర్జరనిక్షరిణీప్రవాహసం
    వలనమిళత్ప్రమత్తయినవారమతిప్రదచంద్రశాలికా
    లలితవతీవిలోలదృగలంక్రియమాణముఁ గుంభఘోణమున్.156

వ. అందు కందళదమందసందీప్తిప్రవాహసంక్షాలితదిగంతరాళసంతమసజంబాలంబు లగుగోపురప్రాకా రంబుల దీపించుమాణిక్యమయమందిరంబునందు.157

సీ. నునుగాడ్పుదూది నించినయట్టిచల్లని
                    పానుపుపై లీలఁ బవ్వళించి
    పటువులై హోంబట్టుబటువులో యన నొప్పు
                    రమచన్నుదోయిఁ బాదములు చేర్చి
    చెలువు దీపింపఁగ శిరముక్రిందట నొక్క
                    కేలు దలాడగాఁ గీలుకొలిపి