పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/889

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్త్రి విద్య

గర్బ మత్తేబము.

మ.నయ మొప్పారఁగ విన్న వించెద నిదే న్యాయంబుగాఁజూచి మి దయలీలం దగ సారసాననలవిద్యాసంవివాదంబులో

జయ మెవ్వారికి వీఁకమైఁ గలిగెనో సామాన్య ధీమైసుధీ
చయముల్ మెచ్చఁగ నీతితొ నుడువుఁడి జల్పాకులై సజ్జనుల్.
                                        గర్బ కందము.

క.వెలఁదులకు విద్య గూడదు,

కలుగు సఘము దాన నిజముగా నని యనఁదా
రెలమిని దలపడినను నా
ర్యులు చెప్పుపలుకుల నెవలయగు గనఁబఱపన్.

క.మొదటనె పూర్వులు చెప్పిన,

యది యనుగర్వంబు మానుఁ డని నే ననలే
దదివారే కల్పించిన
యది యని నే నన్న యట్టులనెదురు కంటే.

తే.వీరియర్దంబుచేసెడివెరవునకును

జాల మెచ్చుంగఁజనుఁ గాని యేల వీరు
నాదుపద్యంబులొ నుండినట్టిదానిఁ
"బదరి" యనుమాట నడఁచితరొ పలుకవలయు.

తే.పద్య ములనెందు నేనొక్క పదమువణఁచి,

యర్ద మొనరింపఁబూనినందుఁగలుగు
నర్ధమెల్లను జెడి పొయి యంతతొడ,
నాగయొచట లేనియపార్ద మొదవు.

అ:ఈమహానుభావు డెఱుఁగని వారికి

"బొంకవచ్చునఘము పొంద దధిప"

యనుచువింత యర్దమును జెప్పుఁగాఁజోలుఁ బూర్వపదచయంబుఁబోవనడఁచి.