పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/855

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరస్వతీ నారద విలాపము.

రంగము-దండకారణ్యము

(వీణులుదాల్చి దుఃఖించు సరస్వతీ నారదులు వేరువేరుగా ప్రవేశించుచున్నారు.) సర-నిట్టూర్పువిడిచి తనలో)

క.ఈపాపులకతమున నా
రూ పెల్లను మాఱిపోయెఁ; గ్రూరాత్ములకున్
జేపడితి  ; మోసపోయితి ;
నేపగిదిం బ్రతుకుఁ గందు నిఁక నే నకటా?
 
క.దాయ లలంకారమిషన్
గాయం బాపాదమ స్తకంబును బొడువన్
గాయపడి మామకాంగని
కాయము నొచ్చెడును దేలుకఱిచినభంగి౯.

(అని విలపించుచున్నది)

                         నార-(తనలో)


క.కటకట! సంగీతంబున
కెటువంటియవస్థ పట్టె నీదేశములో!
పటుతరమోదం బెవరికి
ఘటియింపదు నేఁడు నాదుగానం బుర్వి౯.

క.కటువులె యూహర్తికీర్తన
లటమటమున విటుల కొక్కయర కాసునకు౯
దటుకున మానమె యమ్మెడు
కుటిలాలక లఱచుబూతుకూఁతలకంటె౯?

                          ( ఆలకించి)