పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆఱవ ప్రకరణము

చేత దమస్ధానముల గూరుచుండి చూచుచుండిరి. అందఱును ముట్టుకొని పోయినతరువాత హరిశాస్తృలాముక్కనుదీసి సాంబ్రాణి దూపమువేసి, హారతికర్పూరము వెలింగించి దానిమీద ఆముక్కను నాలుగయిదుసారులు మోపి రాజశేఖరుడుగారి చెతికిచ్చెను. ఆయని చేతిలో బుచ్చుకొని చూచునప్పటికి దానిమీద పెద్దయక్షరములతో 'చాకలసరడు ' అని వ్రాసియుండెను. ఆకాగితముపైకెత్తగానే యెల్ల వారికిని స్పష్టముగా వంకర యక్షరములు కనబడు చుండెను. దగ్గరనున్న వారిలో నొకరుదానిని పుచ్చుకొని చదువు నప్పటికి చాకలి నర్వడొకడుతప్ప మిగిలినవా రందఱును నద్భుతప్రమోదమగ్న మానసులయి చప్పటలు గొట్టి శాస్త్రుల శక్తిని ఉపాసనా బలమును వేయినోళ్ళం గొనియాడ జొచ్చిరి. కొంద ఱక్కడ నున్నవారిలో ' వీడెనగదీసినదొంగ అప్పుడు వెనుక నిలుచున్నాడని వానిని నిందింపసాగిరి. సీత వచ్చి కాసులపేరు పోయినప్పుడు సర్విగాడు పండ్లుచేతిలో బట్టుకొని మా వెనుక నిలువబడినా డని చెప్పెను. అందుమీద నందఱును నగ హరించిన వాడు చాకలి సర్విగాడు తప్ప మఱియొకడు కాదని నిశ్చయించిరి. యింటనున్న వారును రాజశేఖరుడుగారునుకూడ ఆప్రకారముగానే నమ్మిరి. ఆవస్తువును రాజశేఖరుడు గారునుకూడ ఆప్రకారము గానే నమ్మిరి. ఆవస్తువును శీఘ్రముగా దెచ్చియిమ్మని యడిగినప్పుడు , ఆచాకలివాడు కంటికి నేలకు నేకధారగా తోదనము చేయుచు దా నేదోషము నెఱుగనని బిడ్డల మీదను భార్యమీదను ఒట్లు పెట్టుకొనసాగెను. కాని యదియంతయు దొంగయేడువని యెల్లవారును నిశ్చయము చేసికొనిరి. నయమున వాని నన్నివుధముల నడిగినను వాడు తను నిరపరాధి ననియే చెప్పి యేడుచుచు వచ్చినందున , హరిశాస్త్రులు రాజశేకరుడుగారిని చాటునకు 'మాట ' యని పిలుచుకొనిపోయి ' మీ సెల