పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/816

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పథిక విలాసము

ఉ. ఇంతియకాదు సుమ్ము చెడుగెల్ల; నిసర్గజబంధముల్ చెడన్
జింతిలి ధర్మమున్ యశము స్నేహము స్వప్రభుతన్ దొఱంగుట
వింతధనవ్యవస్థల జనించినకృత్రిమ బంధజాలముల్
సంతతమున్ బలపడి బలాత్కృతి నొందు నవిష్టసత్కృతిన్.

క. కావున, నర్వవిధేయత! తావీనికి మాత్ర మెపుడు దాస్యము చేయున్
ప్రావీణ్యంబడుగంటును ;! నేవారికిఁ దెలియ కేడ్చునిట యోగ్యతయున్.

సీ. కాలమీకై వడిఁ గడవంగఁ గడనంగఁ
దనమనోజ్ఞతలెల్లఁ దరలవిడిచి.
నిలుపుదు రెచ్చోటఁ గులపతులు తముల్
దేశాభిమానాగ్ని తేజమెసఁగ,
శ్రమపడిరెచ్చోట రాజులు కీర్తికై
కవులెందు వ్రాసిరి ఖ్యాతికొరకు,
నట్టిపండితులకుఁ బుట్టినయిల్లును
నాయుధపాణుల కాటపట్టు,
 
     నైనయీదేశ మొకటనత్యాశచేత
    సర్వ దుర్వాసనలకును స్థానమగును:
    పండితులు వీరభటులును బార్ధివులును
    సత్కృతిని బొందకిఁకముందు చత్తురిందు.

చ. కొలిచెద పంచునో ఘనులఁ, గోరినృపాళి నుతింతు నంచునో,
      తలఁపఁ బోకుఁడేనిటు స్వతంత్రతచేనగుకీడు లెన్నుచో:
     న్ తొలఁగఁదోలుఁ డిట్టిదగుతుచ్చపువాంఛ మదాత్మనుండి, నా
    తలఁపును బాయకుండెడి యధార్ధసమర్ధలార! దవ్వుగన్.

సీ. ఉరుశోభ నలరారు నోస్వతంత్రత్వమా!
యల్లరిమూఁకల యాగ్రహామునఁ