పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/759

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రథమాశ్వాసము



రొక్కయిక్కను జక్కుల యుడ్బంతు
రొక్కగీమునఁ బాముల నుక్కు మిగులఁ
బెక్కులాగుల సేగులఁ బెట్టుచుంద్రు
రక్కసుల మువ్వురును గ్రొవ్వు పిక్కటిలఁగ. 164

సీ.నీళ్ళుమోవఁగలోఁగె నెఱిమాలి నెల దాల్పు
    కనుమూయుటుడిగెవేగనులవేపల్పు
     బిచ్చకానిని జేరె వచ్చి జక్కులఱేఁడు
పిచ్చుకుంటై పోయె బెగడి జముండు
       రేలు ద్రిమ్మరుచుఁడెఁ దూలిరక్కసుఁ డెప్డు
వంటయిండ్ల నడంగెవచ్చిచిచ్చు
       వంకల కిరవయ్యె వలగొని నీటిఱేఁ
డొకమూలఁ బడియుండె నికఁడు గాలి
 
తక్కుగల వేల్ప్[ఉ లెల్లను దల్లడమున
బయలు వట్టి తురుగునట్టిబ్రతుకు గనుటె
కాక నోరి కోరె మొకింత లేక మనిరి
యకట చెప్పెడి దేమి యాయాగడంబు. 165

క. ఇక్కరణి న్మువ్వురు నా
రక్కసులుం గండకావరంబున నేరిన్
లెక యొనర్పక యొండిరి
యొక్కడఁ గనుఁగొన్నను దమరె యగుచుఁ గడిమి౯. 166

గీ. అంత నొకనాడు వేడుక లనఁగి పెనఁగఁ
బెద్దకొలువుండి మువ్వురుఁ బెం పెసంగ
వేల్పుటగసాలిఁ బిలిపించి వెరవుమీఱ
వలయు మరియాద లొనరించి వాని కనిరి. 167