పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/750

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రోత్తర రామాయణము

 క. సాకెదమని యొకకొందఱు
మైకొనిరిఁకమెక్కెదమని మఱికొందఱు పె
ల్లాఁకలి కోర్వకపలికిరి
యూకొని నెత్తమ్మిచూలి యుల్లంబలర౯.

క. మెక్కెదమ్నువారందఱు
జక్కులును బరాకులేక సాకెదమనువా
రక్కజముగ సోఁకుడులును
నిక్కముగా నౌదురంచు నెట్టనఁబలికె౯.

గీ. పెక్కురమ్మాడ్కి జక్కులురక్కనులును
బొడమిపుడమినిబొగడికనడసిరడరి
వారిలోపలనెంతయు వాసిగనిరి
హేతియుఁబ్రహేతియు న్నంగనిరువురందు.
 
క. నెమ్మదిఁబ్రహేతిముద్దల
గుమ్మలకూటములు రోసి కోర్కుల నెల్లం
గ్రమ్మి తెగగోసి మిక్కిలి
ముమ్మర మగునీసు వాసి పొలుపుగనుండెన్.

ఉ. రెండవనిబ్బరంపురెయిద్రిమ్మరి ఱేఁ డల హేతి దండియై
పెండలి యయ్యె నొయ్య భయపేరిటిముద్దులగుమ్మఁ గొమ్మరే
యెండను నవ్వు నవ్వు పసనింపగు దానిని సల్వ యానతి౯
వెండియు డెందమందు మగబిడ్డలకై గలకూర్మి పేరిమి౯.

క. అయిరువురకుం బుట్టెను
దీయనివిల్కానితోడ దీటై యని వెన్
దీయని విద్యుత్కేశుఁడు
సోయగమున కింతు లెల్ల, సొగయుచునుండ౯.