పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/697

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయా శ్వాసము


సీ. చెప్పక కర్ణుని చొప్పును దాఁచిన
తనతల్లి నేమియు ననఁగలేక
యిఁక ముందు పుడమిలో నేకతమెప్పుడు
తలిరుఁబోఁడులవద్ద దాఁగకుండుఁ
గాకయంచును నల్క గడలుకొనగ దిట్టి
కాయగూరలు దించుఁ గానలందుఁ
దానుందునని లేవఁ దమ్ములు ద్రోవది
పెక్కువగలఁ దెల్ప బెడవెవులను

బెట్టి పట్టిన పట్టును విడువకుండె
నంత జడదారు లందఱు ననువుమీఱఁ
బలుదెఱంగుల నాయముల్ పలికి మదికి
హత్త నూఱిపోసినఁగొంతమె త్తనయ్యె.

క. జడదారిదొరల నుడువుల
నెడఁదం గల కలఁక తొలఁగి యీకొనెఁగడకున్
బుడమిం గైకొనియేలఁగ,
నడవుల కేగెడితలంపు లడుగంటంగన్.

చ. తపనులు చుట్టముల్ చెలులుఁ దమ్ములునుం బెదతండ్రి తోడ రా
నపుడ యుధిష్ఠిరుండు తగ నచ్చటువెల్వడి వీడుచేర న
చ్చపుఁ దెలివిం జనెం బజలు సంతసమారఁగభీమునన్న తా
నెపు డరుదెంచు మమ్ము నెపుడేలు నటంచును గాచియుండఁగన్.

వ. మఱియు నంతకుముంగలన యయ్యూరిచార లంతయువిని తంతం తనరాని సంతసంబున.

సీ. కమ్మకస్తురినీటఁ గలయంపి చల్లించి
ముత్యాలమ్రుగ్గులు మొగి నమర్చి
యపరంజికంబాల నరఁటిచెట్లను గట్టి
క్రొమ్మావిదోరణా లిమ్మువఱిచి