పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/691

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

తే.ఆఁవుకొన్ననునాఁగక యంతకంత
కడరి మదిఁబొంగి పొరలెడునలుకకతన
జమునిపట్టినిదిట్టంగఁజలముపూని
నట్టిగాంధారి నోదార్చె వ్యాసుఁడపుడు.

క.వడముడియును గాంధారికిఁ
గడుఁదీవులు పుట్టునట్టుగా మఱుమాటల్
నొడివి యడంకువ నాయమ
యెడఁదం గలయట్టి కినుక నెల్లను నుడిపెన్.

ఉ.అత్తఱి నామెయానతిని నన్నయుఁదమ్ములు ద్రోవదింగడుం
బత్తిని వెంటఁబెట్టుకొని పాండుకొమారులు తల్లి పాలికిం
గుత్తుకబంటి నెవ్వగలఁగూరి చనంగఁగొమాళ్ళ నెల్లఁ దా
నెత్తికవుంగిలించుకొని యేడ్చె నొకించుకసేపు గొంతియొ౯.

 క.అటుపిమ్మట నడుగులఁబడి
పొటపొటఁగన్నీరుజాఱి బుగ్గలుతడియ౯
గటకటఁఁబడు కోడలి మి
క్కుటముగ నూరార్చి యాపె కుందుడిగించె౯.

సీ.అంతవారందఱు నడలెల్ల విడనాడి
           సరగ నెయ్యంపు ముచ్చటలు నెఱసి
చిట్టపక్కంబులు చుట్టును నడనేర
           వెడలి యందఱు నొక్క పెట్టగాఁగ
ధృతరాఘ్టృ కడఁజేరి తెఱవలు నెయ్యురు
           బంటులు వెను వెంటనంటి రాఁగ
నెల్లవారును గూడి యల్లన నాలంపు
            నేలకు నడిచిరి చాలఁదాల్మి