పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/684

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంద్ర భారతసంగ్రహము

</poem> చ. వెనుకకుఁబోవుచు న్మగుడ వీఁకమెయిం బఱతెంచి తాఁకుచుం

     గనుఁగవ నిప్పుకల్  సెదరఁ గనొనుచు గుదెలొక్క పెట్టునన్
     గనలునఁ ద్రిప్పి యేండొరులఁ గండలురాలఁగఁ గొట్టుచున్ జలం
     బున నడగొం డలట్ట కడుఁబోరిరి నెత్తుటఁ దొప్పఁదోఁ గియున్. 

వ. ఇట్లమ్మేటిమగలు మిగులఁ దెగువ మెయిం బెనంగుచు గుదియలు

     పూనిమేనులుసించుచు నొం చుచు నొండొరు మించుచు గుదియలు
     బులు పగిలి గాయంబులనుండి పెల్లుగం  దొరుంగు క్రొన్నెత్తురుల
     వెల్లువలు కొండలనుండి వెలువడిన సెలయేళ్ల మెుత్తమ్ములఁ బురు
     డింప నొండొరువులకు నట్రపడక కడిమి చూపుచుండ 

దుర్యోధనుండు తన నేరిమి వేరిమిని వడముడి బెడిదంపు గుదియపెట్లం దప్పించు కొనుచుననుచు వేడుకతోడఁ దన ప్రోడతనంబు చూపఁ గడంగిన నెఱింగి కఱివేలుపుపంపునం గవ్వడి వడిముడికి సైగజేసిన నాసన్న కన్నెఱిఁగినవాఁడై యాతండు లయ్యం పుఁబాడిఁ దొఱంగి.

క. బెడిదంబగు గుదెపెట్టునఁ

      దొడలు విఱుగఁ గొట్టిక్రిందదొడిఁబఁడబుడమిం
      బడియుండిన దుర్యోధనుఁ
      గడఁ కందలదన్నె నెడమకాలనలుకతోన్.

అ. అట్లు పాడి విడిచి యాతనిఁ దన్నుట

      చూచి యలుకవొడమిచూడ్కులందు
      నిప్పులురుల లేచి యప్పుడ బలరాముఁ
      డడరి భీముఁ జంపఁగడఁగుటయును.

క. వెన్నం డడ్డముగాఁ జని

     యన్నను మరలించి తెచ్చి యాతనికినుకం
     దిన్ననిమాటల మానిచి
     మన్నళతో నన్ననంచె  మనించె మనికిం  జేరన్. 
  

</poem>