పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/670

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

      వెన్నుఁడొనరించు చీఁకటి కన్నెఱింగి,
      క్రీడిసైంధవు తలద్రుంచి కీడుతలఁగఁ
      బాశువదమున నద్దానిఁబడఁగవై చెఁ,
      దండ్రితొడమీద నంతనీ రెండవచ్చె.

ఉ. అప్పుడెకృష్ణుఁగూడిచనియర్జునుఁడన్నకుమొక్కిసైంధవుం
       డొప్పమిచేసి రూపఱుట యుబ్బునఁజెప్పెనతండుపొంగఁగాఁ
       దప్పును ద్రోణుమీద విడితాధృత రాష్టునిపట్టి యచ్చటం
       జెప్పెడిదేమి రేయి యనిసేయగఁబంచెను మేటిజోదుల౯.

చ. ద్రుపదునివంకవారలను ద్రుంపక మైమఱు వూడ్వనంచు నే
      నపసను ద్రోణుఁడుంబ్రతినవట్టె నటుండఁగఁజంపె గాలినే
     లువు కొమరుండు దుష్పహుఁడు లోనగు నాధృతరాష్టుబిడ్డల౯
     గృపుఁడునుగర్ణునిం బదరెఁగింకను రజ్జులువల్కుచుందఁగాన్.

క. ఈలోనశ్వత్థామయు,
      నాలములో రక్కసి దొర నంజనపర్వుం
      గూలిచె నప్పుడెభీముఁడు,
       వాలమ్ములు మేనగ్రుచ్చి బాహ్లికు ద్రుంచె౯.

తే. సాత్యకియుసోమదత్తుండుచలముమీఱ,
       నొండొరులతోడఁబోరాడుచుండనందు
      వెన్నుతమ్ముఁడుమిక్కిలి బీరమునను,
      సోమదత్తునితలద్రుంచె సూడు మిగుల.

క. అదిగని యందలి ద్రోణుఁడు,
       మొదలగువారలు కడంగి ముట్టుకొనంగా
       నెదరించి నిలిచి రిందును,
       బొదువంగల జోదులెల్లఁ బొంగెడుమదితో౯