పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/642

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

గూలఁగనేయ మూఁకలనుగోయని యాఱిచినిల్వలేక యా
వేలుపుఁబ్రోడ నింగికిని వేచనఁ జూచుచుఁ గ్రీడిప్రొడయై.

క. అమ్ములగూఁ డొనరించుయు,
నెమ్ములపడఁ జిత్రనేను నేసిన వెఱచే
నిమ్ముల దుర్యోధనువై,
ళమ్మునఁ గవ్వడికినిచ్చి లలిఁబనివినియెన్.

ఆ. కట్లతోడనవుడు గాంధారిపట్టిని,
గాడ్పుపట్టి యన్నకడకుఁ దేఁగఁ
గనికరమునమేని కట్లెల్లవిప్పించి,
వడిగహితవుచెప్పి విడిచిపుచ్చె.

ఆ. ధౌమ్యునియింట నునిచి తగనన్నదమ్ములు,
పండ్లుదేరనడవి పట్లకరుగఁ
గ్రొత్తపెండ్లిచేసికొనుచు నాదారిని
సైంధవుండు చనుచు సరగమోల.

చ. నిలుకడఁగన్న క్రొమ్మెఱుఁగు నీటున మేనునుదాల్చి యిచ్చమై
మెలఁగెడు గుజ్జుమావివలె మేలిమిచేఁతలుపూని మెత్తనై
చెలఁగు పసిండి బొమ్మవలెఁ జేరువగ్రుమ్మరుచున్న ద్రోవదిం
గలయఁగఁజూచి పూవిలితు కమ్మనిముల్కులనొచ్చి క్రచ్చఱన్.

క. కదియంజని మిక్కిలి ద్రో,
వది బతిమాలియును దెన్నువడయక బలిమిం
దుద కాయింతిని దేరను
బదిలముగాఁ బెట్టుకొంచుఁ బఱచెంగానన్.

తే. ధ్యౌమ్యుఁడఱచుచు వెంటను దవిలివానిఁ
దిట్టుచును బోవనంతలోదిట్టయగుచు