పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/616

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
దిట్టి చచ్చిన దిగులొంది దిటముపూని,
యింటివంకకు మరలక యెఱుక మెఱసి
తవసితనమూని కొన్నాళ్ళు తాళియుడి,
సంతు లేమికినెంతయు వంతనొంది.

ఆ. కుంతి జేరబిలిచి గొబ్బునదనకోర్కి,

తేటపఱిచి వేడ బోటియెట్ట
కేల కొప్పుకొనియు గెలనీ యుధిష్టిరు,
డనిడి కొడుకుబడసె నజ్జమునికి.

శా. ఆచోటన్ ధృతరాష్టుృతొయ్యలియు నొయ్యంవేకటీందాల్చి ము

న్నే చూలాలయి కుంతిపట్టిగని తానెంతో మదిం బొంగుటల్
చూచాయంవిని యోర్వలేక వగతో జొక్కొంది లోగుంది ఱొ
మ్మాచెన్నారు నెలంత గ్రుద్దుకొని బాడై చూలొగిన్ జూఱగన్.

వ. అట్లాకొమ్మ ఱొమ్ము కరమ్ము వమ్మగునట్లుగా గోరమ్ముగా గ్రుమ్ముకొన్న నెత్తుచెడి క్రొత్తనెత్తురులం జొత్తిల్లి తుత్తునియలయిపడ్డ కందమొత్తమ్ములనెత్తి క్రొత్తకడవలలోనం బెట్టించి వ్యాసుండు నూఱువురగొడుకులనునొర్క కొతును బుట్టించె నందు బెద్ద వాడు దుర్వోధనుండును రెండవవాడు దుశ్శాసనుండును వారి చెల్లెలుదుస్సలయు ననంబరగి పెరుగుచుండిరంతనిచ్చట.

క. ఆట దుర్వోఅధను డొదవిన

దిటమగునానాడె గాలిదేవరవలనన్
దటుకున భీమునిగనియెను
నిటగుంతియు మగడు పనుపనెంతయునెలమిన్.
క. అపిమ్మట వేలుపుదొర
నాపోవక మగడు వేడ నానతియీగా