పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/593

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతుర్ధాశ్వాసము


పండ్లుకొఱుకుచు నిల్వక యెగసిపడెడు
చిలుకనీబ్రతుకెల్ల ఁ జెట్లఁగలయ
పురుటింటిబూచులపోల్కి నివ్వెఱగొల్పు
తుమ్మెదానీత్రుళ్ళుతుప్పలెక్క
గంతులిడుచును దెరువర్లఁ గలఁచు చుండు
నెమ్మి నీయాటలెల్లను నేలఁబడను
నీళ్ళునములుచు మగువల నెగులుపఱచి
నిక్కు రాయంచ నీతిండినీరుగాను.

వ. ఇట్లు దూఱుచుండ.

ఉ. పిట్టలుగూసెఁజీఁకటుల పెంపెడఁబాసె మెఱుంగు రిక్కచాల్
బిట్టుగమాసె జక్కవలు వేడుకనొండొరుడాసెఁగల్వలె
ప్పట్టునఁదెల్వివాసె వెతవాసిన తమ్ములుపొంగి తేంట్లకున్
నెట్టనవిందుచేసె విలునేర్పునమూసె మరుండువేఁకువన్.

గీ.
వెచ్చకాండ్రమదులవేడుకడిందంగ

పాఱులలరి పగతటిపనులకడర

వడిగఁగాఁపునారు పని పా