పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/591

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

గీ. ఒకటి రెండునాఁడులు చెల్లియున్నాఁడె చూడరాడని నినుఁ బెద్దలాడుచుండ
 బెద్దవాఁడవై మిన్నంది మెలఁగునిన్ను
  జానలకుఁ జూడవచ్చుంనే చందమామ.

 గీ. తమ్మికంటియటంచు మాతలిరుబోఁడి
  నలుక మెయినలంచెద వేమొ యట్టుకను
  కలువకంటియెసుమ్ము మాకలికిమిన్న
  కనికరముచూపి కావుమో కలువ ఱేఁడ.

చ. సిరినిదోడఁబుట్టువయి చెన్నుగ వెన్నునకు న్మఱందివై
  యరిపదిమోములున్న దొర కౌదలనందపు మానికంబవై
  మరునకు మేనమామవయి మన్నన నత్రికి ముద్దుపట్టివై
  కరమలరారు నీకిటులు కల్కులనేఁచి కలంచఁబాడియే.

 చ. ఒరులకు ఁజేరదవ్వగుచు నొజ్జలకొంపనుదీసి తమ్ములం
  గరము బడల్పడంబఱపి కాంచినతండ్రికిఁ బోటు తెచ్చివం
  కరతనమల్ల చిన్నపుడె కాంచి కరంబునునీవు రేయిత్రి
  మ్మరివని పేరుపొంది యిఁక మన్నసఁజూతువె యాఁడువారలక్.

 సీ.నీదువెలుంగులు నెఱకాఁకలౌటను
                        జాలనీరగునెఱఱాలెతెలుపు
  నీనడతకరంబు నీతంబు తప్పట
                         నువిదఁగోల్పడిన నీయొజ్జతెలుపు