పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతియాశ్వాసము

క. కుంకుము సోకగ నెఱుపయి
యింకొకయెడ బపపుసోక నెలపచ్చనయై
పొంకపు గాటుకసోకిన
వంక నలుపయి కొలకు పలువన్నెల నమకెన్.

సీ,కప్పుకొప్పులనుండి కాఱుచుండెడునీరు
చిఱుతమబ్బుల వానచినుకులట్లు
గబ్బిగుబ్బలనుండి కాఱుచుండెడునీరు
బలితంపుమలల పెంవాకలట్లు
కమ్మమోములనుండి కాఱుచుండెడునీరు
సొగసుచందురు మంచుసోనయట్లు
కలికికన్నులనుండి కాఱుచుండెడునీరు
నెత్తమ్మిపూవు దేనియలయట్లు
వా తెఱలనుండి తగజాలువాఱునీరు
పలుచనగు దొండపండులపాయట్లు
వింతవింతలదనరె గంవిందుగాగ
లేమలటనీటిలోముంగి లేచునపుడు.

గీ.పడతిమిన్నలుకొలకు వెల్వడెడునప్పు
డొడలనంటిన నీటిబొట్లొప్పుమీఱె
నేపళంబుగ బెరుగు క్రొందీనగములు
మొగ్గతొడినకై వడి ముద్దుగులుక.

చ.తనతలఱెక్కలంజొనివి దాపుననొడ్దునవంచు పవ్వళిం
చిన గనికట్టుపుట్టమని చేడ్జియయొక్క తె కేలవంట ము
క్కుననది కేల్వడింబొడున గుబ్బెతగొబ్బున మల్కిపాటువన్
వెనుకకువచ్చె దాంజిగని నివ్వడినవ్విరి తోడిచేడియల్.