పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము

క. కొబ్బెరకాయల మెక్కుచు నిబ్బరముగఁ గొల్చువారి నెఱిఁబ్రోచెడియా గిబ్బవజీరుకొమారుఁడు గొబ్బుననొడఁ గూర్చుగాత ఁ గోరికలెలమిన్.

చ. కలుములచేడెకోడలు నిగారపుఁ దెల్లనిమేనిచానప ల్కులసిరికాటపట్టు బలుకోరికఁబెన్మిటిమెముదమ్ములు దలరెడుకొమ్మ సోయగపు టంచపయిన్నడయాడుచామ దూ నలువవెలంది నిచ్చలును నాలుకఁగాపురముండు గావుతన్.

వ. అని వేల్పులనెల్లం గొనియాడి.

గీ. నన్నయఁదలుచి తిక్కననెన్ని పిదప నెఱ్రప్రగ్గడఁ గొనియాడి యెల్ల తెలుఁగు కబ్బవుంగూర్పరుల మదిగారవించి యెుక్కటను బెడ్దలకునెల్ల మెుక్కులిడుదు.

గీ. నిండు నెమ్మేను విడనాడి వుండులకును నిక్కు నీఁగలవగమాని నీరువిడిచి పాలుగొనునంచ తెఱఁగూని వఱలువిూరు తప్పులఁదొఱుగి నెనరుంచి యెుప్పెగొనుడు.

వ. ఇట్లు వేల్పులం దొల్లింటి తెనుంగు కబ్బంపుఁగూర్పరుల వేర్వేరఁ బేర్కొని నానేర్పుకొలంది నిక్కయబ్బురంపుఁ దెలుంగుకబ్బం బొనఁగూర్పందలంచి మొదలనాకొలంబు తెఱంగించుక వక్కా ణించెద.

సీ. జగములఁగలిగింప నెగడింపఁ బొలియింపఁ గల వెన్నుఁడేవేల్పు కన్నతండ్రి యెలమినెల్ల రకును గలుములుకలిగించు

                                              సిరిచెలియే వేల్పు చెలఁగుతల్లి