పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గీ. అనినంతయు నాలించియరుదుగాంచి

చెంతజడదారిఁదిలకించిగొంతికొడుకు
నింతితనయిల్లుచేరినయంత నెద్ది
జరగెనానతీ జనునిక సరగననుడు

క. రక్కనులును జేజేలును

జక్కఁగఁగడలితరుచు తఱిజాలయియొడళుల్
చెక్కలు చేసినచేదును
గ్రుక్కంగొన్నట్టిఱేఁడకొట్టికసూడా.
పంచచామరము. కలంగితో డిరక్కసీండ్రుకాలికొల్దిదూటఁగాఁ
జెలంగుచుం దిగంచుక త్తిచేతఁ దళ్కులీనఁగాఁ
గొలందిలేనికిన్కతో డగ్రుడ్డు లెఱ్ఱఁజేసియా
తొలంగుహా త్తిసోఁకు ఱేనిఁద్రుంచినట్టిరాయ@ండా.


ఇది శ్రీమదాపస్తంబసూత్ర లోహితసగోత్ర కందుకూరివంశపయః పారా
వార రాకాకై రవమిత్ర సుబ్రహ్మణ్యామాత్యపుత్ర సుజనవిధేయ
వీరేశలింగనామధేయ వ్రణీతంబైన శుద్ధాంధ్ర నిరోష్ట్య
నిర్వచన నైషధంబునందు ద్వితీయాశ్వాసము.