పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

క.అంచలరాయండొక్కడు
కొంచక తనయనుగు జెలులుకొందఱతోనే
తెంచియెదుటనేలకుడిగి
యించుకనడయాడజూచి యిచ్చనలరుచున్.

క.ఒడయండంతటనంచల
నడల తెఱంగెల్లగాంచి నగుచుగడంక౯
గడుకొనియొకరాయంచను
దడయక చిక్కించుకొనియెదనకెగేలన్.

ఉ.దానిదొఱంగియేగుటకు దాళకయంచలు కొంతచెంగటన్
జూనుగనుండికన్గొనుచు జయ్యననేగుచు జాలిదూలు చుం
గానగనేగుదెంచుచును గ్రక్కుననాతని నిక్కిచూచుచున్
దానినిజీరుచుం దుదళుదద్దయు డస్సితొలం గెనచ్చటు౯

గీ.అట్లుచిక్కియంచ యారాచరేఱేడు
తనకుగీడుసేయుననితలంచి
యేలికకుడిచేత నాలుకతడియాఱ
నిలిచికన్ను గొనల నీరుతొరంగ.

గీ.అళుకుగదిరియొడలు దడదడలాడంగ
నోరురాకకొంతయూరకుండి
యెట్టకేలకింత యెదగట్టిచేసికొం
చెలుగుపన్నగిలగ నిట్టులనియె.

క.ఏటికినరుదెంచితినీ
తోటకునిందేలచెలుల తోడదిగితి న
న్నేటికి నేలికలోగొనె
నేటికిని నేగితలగ నెయ్యదితెరఱగో.