పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము

గనెను, శ్రీకృష్ణుఁడుజాంబవంతుఁడను భల్లూకరాజుయొక్క పుత్రికనువరించెను. దేవేంద్రుడును సూర్యుడును బుక్షవిరజుఁడనుమర్కటమును కామించి వాలిసుగ్రీవులను గనిరి. మీవారిగుట్టునాకుతెలియదనుకొన్నావా?ఈమాటలను నప్పటికారాక్షసియొక్క పురాణపరిజ్ఙానమునకు నాకత్యాశ్చర్యము కలిగినది. మనపురాణములలోని రహల్యములన్ని యాయాఁడుదాని కెట్లుతెలిసినవో! శ్రీరాములవారికి తరువాతనేనొక్కఁడనుదక్క భరతఖండవాసులు మఱియెవ్వరును లంకాద్వీపమునకు వచ్చియున్నట్లు నేనువినియుండలేదు. ఇఁకనెవ్వరీమెకీగాధను జెప్పియుందురు? ప్రపంచమునందంతటను లోకానుగ్రహాధముగా తిరుగుచుండెడు హిమాలయభ్రాతలయిన మహాత్ములెవ్వరోయీమెను శిష్యురాలినిగా నంగీకరించిగుప్తవిద్య నీమెకుపదేశించియుందురు.ఇది నిశ్చయముకాకపోయినయెడల లంకాద్వీపములో నంతగ పురములయందుండెడు రాజకన్యకిట్టి శాస్త్రమర్మము లెట్లుతెలియును? ఎటువంటిమహాత్ములు చెప్పినను పరదేశస్థులకు మనవారిమహిమలు నవిస్తరముగాఁదెలియవు. ఈమె చెప్పున విషయములలో నెన్నో ప్రమాదవచనములున్నవి. ఊర్వశినిజూచుటచేతస్నానము చేయుచున్నవిభండక మహషికిజలములో వీర్యపతన మగుటయు లేఁడియానీరుత్రాగి గర్భముధరించి బుశ్యశృంగునికనుటయు తెలిసికోలేక విభండకుఁడు లేఁడినిపొందినట్లుచెప్పినది. బుక్షవిరజుఁడునీటిలో మునిఁగివానరస్త్రీ యైనప్పుడింద్రసూర్యులుకామించినకధ తెలియకవారు పురుషరూపముతోనున్న బుక్షవిరజునినే కామించినట్లు చెప్పినది.ఇట్టివ్యత్యాసములనుగూర్చి నాలోనేనా లోచించుకొనుచుండఁగా వారాక్షసాంగన కొంతసేపూరకుండిమరల ప్రశ్నలువేయుట కారంభించినది.