పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజాపూర్వదేశయాత్రలు

గ్రుచ్చుకొని తీవ్రవేదననుకలిగించినది. ఆవేదనకుభయముతోడ్పడి నన్నుకొంతసేపుమూర్చలో ముంచినందుననావలనేమి జరగినదోనేనుచెప్పలేను. మూర్చతేఱినేనుమరలకన్నులు విచ్చిచూచునప్పటికి చుట్టునునంధకారబ్ంధురముగానుండెను; ఏప్రక్కఁజూచినను నాకంటికేదియుకనఁబడలేదుగాని నాముక్కునకు మాత్రముముఱికి కాల్వలోనుండివచ్చునట్టి నన్నాజంతువుమాయింటి దారితూముకాల్వలోనుండి యీడ్చుకొని పోవుచున్నదినేనుహించినాను, ఇట్లనుకొనుచుండగానే నాకాదుగ౯ంధవిముక్తికలిగినదికాని యాసౌఖ్యమును చిరకాలముండి నదికాదు. జంతువునన్ను నోటఁగఱచుకొనిమాయింటి వారితూము కాల్వలోనుండి మఱియొక రియింటిలోనికిఁ గొనిపోయి దీపమువెలుగుచున్న యొకగదిలో నన్నుక్రిందదింపినది. ఇదియంతయుఁ జూచి యీకపటకృత్యమం తయునాకు శత్రువులుగానున్న కామరూపులయిన యానపనాగరికుల పనియని నేనుమనస్సులో నిశ్చయించుకొన్నాను. దీపమువెలుగు నన్నీడ్చుకొనివచ్చినజంతువును నల్లగా నాకంటికిస్పష్టముగాఁ గనఁబడినదిదానినిజూచునప్పటికి నామేను నిలువునను జెమిర్చిప మొందఁజొచ్చినది. అది మనదేశమందలి యెలుఁగుబంటి యంతయున్నది; ఎలుగుగొడ్డునకువలె దాని శరీరిమందంతటను బొచ్చులేదుగాని వరాహమునకున్నట్లుగా మెడమీఁద మాత్రము దబ్బనములున్నవి. మీరయిన పక్షమున దానిని పెద్దయడవిపందియని భ్రమించి యుందురుగాని యాదేశపుజంతువులపరిమాణముల నెఱిఁగియున్న నేనెప్పుడొక్కనిమిషములోనది పందికొక్కని