పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

దేవమ్మ పుట్టినింటివంక వారిలో మాత్రము యజ్ౙము జేసినవారు బొత్తిగా లేకపోలేదు. సాక్షాతుగా ఆమె పితామహుఁడే యజ్ౙము చేసి యేఁటేట నొక్కక్కటిచొప్పున మూడు పదులమీఁద నాలుగు శ్రావణ పశువులను బట్టి మఱి రంభాదులతో స్వర్గసుఖ మనుభవింపబోయెను. సోమిదేవమ్మ తండ్రి యజ్ౙము చేయకపోయినను, తండ్రి యెంతో ధన వ్యయము చేసి సంపాదించుకొన్న వేళ్ళను మాత్రము పోఁగొట్ట నిష్టములేనివాఁడయి తన కుమారునకు సోమ జులనియు, మారెకు సోమిదేవమ్మ యనియు, నామకరణములు చేసెను. రుక్మిణియు సందులో నూఱుబాగలు నడిచి, అక్కడనుండి దక్షిణ్ముగ తిరిగి, ఆ సందులో రెండుగుమ్మములు దాఁటి పెరటి దారిని మూడవయిల్లు ప్రవేశించెను.

రాజశేఅఖురుఁడుగారి యిల్లు ఆకాలపుటిండ్లలో మిక్కిలి సుందరమైనది. వీధిగుమ్మమునకు రెండుప్రక్కలను రెండు గొప్ప అరుగులు కలవు. ఆ రెండు అరుగులకును మధ్యనుపల్లముగా లోపలికిఁబోవునదవ యున్నది. ఆనడవమొగమున సింహద్వారమున్నది. ద్వారబంధువు పట్టెలకు గడపదావున ఏనుఁగుతలమీఁద సింహము గూర్చుండి కుంభస్ధలమును బద్ద్దలు చేయుచున్నట్టు చిత్రముగా చెక్కబడి యున్నది. ఇరుప్రకలనందు నా సింహములయెక్క శిరోభాగములు మొదలుకొని గొడుగుబల్లవఱకును పువ్వులును కాయలను గల లత చెక్కఁబడి యున్నది. ఈకమ్ములకు పయిగా రెండు ప్రక్కలను కఱ్ఱగుఱ్ఱములు వీధి వైపునకు ముందరి కాళ్ళు చాచి చూచువరిమీఁద దుముకవచ్చునట్లుగాఁగానిపించును. ఈ గుఱ్ఱముల కాళ్లకే శుభదినములందు మామిడాకులతోరణములు గట్టుచుందురు. గుఱ్ఱముల రెంటికిని నడుమనుండు గొడుగుబల్లమీదఁ నడుమను