పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంకా ద్వీపము

సత్య- జనుల ధనప్రాణములతో సంబంధించిన వ్యవహరములో సత్య నిర్ణయముచేయుట కేగ్పఱుపఁబడిన పండితోత్తములనైనను చక్కగా కాలము కట్టంగలవారిని, సరిగా లెక్కవేయఁగలవారిని చారించి యేర్పఱుకకా?

మహా- పండితోద్యోగమునకు దేశములోఁ గల జ్యొతిష్యవిద్వాంసులలో శ్రేష్ఠతములనే యేరి యేర్పఱుతురుగాని యిది గుప్తశాస్త్రమగుటచేత నెవ్వరు గట్టివారో యెవ్వరు కారో యేర్పఱుచుల యసాధ్యము. ఇటువంటి శాస్త్రములు రహస్యముగా నుంచఁబడినంత కాలమే తమ మహిమలను గోల్పోయి పాటితప్పిపోవురు. కాఁబట్టి శాస్త్రమన్నది యెవరికిని దెలియకుండ సదా గోప్యముగా నుండవలెను.

సత్య- తమరు సెలవిచ్చినది కొంతవఱకు సత్యమేకాని--

మహా- కాని యని నీవేమో సంశయపడుచున్నావేమి? నేను చెప్పినది సత్యమగునా?కాదా?

సత్య-- తమరు సెలవిచ్చినది నిస్సందేహముగా సత్యము. అండసత్యమణుమాత్రమునులేదు. నాకు వేదవాక్యముంకంటెను తమ వాక్యమునం దెక్కువ గౌరవము. సూర్య చంద్రులు గతులుతప్పినను తమ నోటినుండి యసత్యవాక్కు బయలువెడలునా? శాస్త్రమర్మము లెప్పుడును సర్వజనులకును వెల్లడిచేయాఁగూడదు. అందుచేతినే మాదేశము నందుగూడ చదువెఱుఁగనివారు సహితము జ్యోతిశ్శాస్త్రములోను. వైద్యశాస్త్రములోను, మంత్రశాస్త్రములోను, మహవిద్వాంసులయి జనసమ్మానముపొంది కోటీశ్వరు లగుచున్నారు.

మహా-- ఈసంభాషణమును బట్టి నీవు రహస్యోపదేశమునకు పాత్రుఁడవయినట్టు నాబుద్ధికి పొడకట్టినది కాఁబట్టి నేనిప్పుడు
మర్మము