పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంకా ద్వీపము

వలెను. కైకనీయను నీ కామిని నా భార్య. నేనింట లేనప్పుడీ ప్రహస్తుండు నా వేషము వేసికొనివచ్చి-

ధర్మా-ఇక వీరివలన స్త్యము బయలబడదు.-ఓ కైకసీ ! వీరిలో నీభర్త యెవ్వడో నీవు చెప్పు.

కైక-(ఇరువుర మొగములవంక జూచి)ఓమహాప్రభూ ! నేను గదిలోనున్నప్పుడు నాభర్తకు కుడివైపున గూరుచున్నాను. అప్పుడు కూరుచున్నట్లు కూర్చుండబెట్టినపక్షమున నా భర్త యెవ్వరో నేను జెప్పగలను. రాజభటులు వారి నిక్కడకు దీసికొనివచ్చినప్పుడు తమతమ స్థానములను వదలి వారిద్దఱును గలసి పోయినారు. ఇప్పుడు నేనెవ్వరివంకజూచిన నతడే నాభర్తగా గనబడుచున్నాడు.
మొ-ప్రహ-ఓప్రాణేశ్వరీ ! అతనివంక జూడక నావంక జూడు. నేను నీకుభర్తనుకానా ? ఓరీ వంచకుడా ? నీవు మాయ చేసినంతమాత్రమున పెండ్లి నాటినుండియు నన్నెఱిగిన నాధర్మపత్ని నిన్ను భర్తయనుకొను ననుకొన్నావురా ? ఓప్రాణేశ్వరీ ! నిజము చెప్పవేమి ?
కైక-మీరే నా ప్రాణవల్ల భులలాగున నున్నారు.
మొ-ప్రహ-ఓప్రాణేశ్వరీ ! యీమోపగాని మాయమాటలను నమ్మి మోసపోకు, నీవిందాక నాకుడుప్రక్కను గూరుచుండలేదా ? యింతలోనే నన్ను గుఱుతుపట్టలేక పోయినావా ? నేనే నీకు నిజమయిన భర్తనగుదునో, కానో నా మొగముచూచి చెప్పు.

కైక-మీరును నా ప్రాణవల్ల భులలాగుననే యున్నారు.

ధర్మా-ఈయంశమీలాగున తేలదు. నీభర్తయెవ్వరో యా మాట యటుండనిచ్చి నేరము జరిగినదో లేదో నిజముచెప్పు.