పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము

దాటునని యంగదుఁ డడిగినట్టు చెప్పియున్నారు. శ్రీవాల్మీకులవారే యుద్ధ కాండమునందు.

<poem>శ్లో."దశయోజనవి స్తీర్ణం శతయొజనమాయతం దదృశుర్దేవగంధర్వానలనేతుం సుమష్కరం".

అనినలుఁడు నూఱు యెాజనముల పొడుగును పదియెాజనముల వెడల్పుగల నేతువును కిట్టునట్టు సెలవిచ్చియున్నారు. సింహళమేలంక యైనపక్షమున, రామేశ్వరమునకును లంకకును మధ్యనున్న సముద్రము నూఱూయెాజనముల వెడల్పు గలదయి యుండవలెనుగదా?నూఱుమైళ్ళయినను లేక రామేశ్వరమునకును సింహళ ద్వీపమునకును మధ్యనున్న సముధ్ర మింగ్లీషువారి లెక్కప్రకామే అఱువదిమైళ్ళున్నది. రామేశ్వరమున కఱువది మైళ్ళ దూరములో నుఁడి మిక్కిలి నిడుపైనచోట ౨౭౦ మైళ్ళూను, మిక్కిలి వెడల్పయిన చొట ౧౪౦ మైళ్ళూను గల చిన్న సింహళద్వీప మెన్నడయిన లంకాద్వీపము కానేర్చునా? సింహళమునకును రామేశ్వరమునకును నడుమనున్న యిసుకతిన్నెలే నేతువయిన పక్షమున, పూర్వమాంజనేయాది నావీరులు హిమవత్సర్వతాదులనుండి విఱిచితెచ్చి పడవేసిన పర్వత శిఖరములన్నియు నేమయిపోయినవి? సింహళమే లంకయిైన పక్షమున అందు మహాసత్వులయిన రాక్షస సత్తములుండక దుర్బలులైన యఱవవాండ్రును సింగాలి వాండ్రును కాపురమేల యుందురు? కాబట్టి యిట్టి హేతులను చక్కగా పరిశీలించి హూణులు వ్రాసిన గ్రంథములను విశ్వ సింపక, సింహళ ద్వీపము లంక కాదనియు నేనిప్పుడు పోయి చూచినదియే రావణ లంక యనియు మీరు దృఢముగా నమ్ముడు.

మనమిక భూగోళ శాస్త్ర ప్రసంగమును కొంచెము సేపు చాలించి ప్రస్తుత కార్యాంశమునకు వత్తము. నాక్రొత్త యజమానుని పేరు