పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజాపూర్వదేశ యాత్రలు

యూడలు నాకౌఁగిటి కడగినవికాపు: కొమ్మలారంభమైన మ్రానిప్రకాండముయొక్క యెత్తన్నూఱడుగుల కంటె హెచ్చుగానున్నది; మ్రానియొక్క కైవారము సరిగా కొలవలేదుగాని నూఱడుగులకంటె నెక్కునగానేయున్నట్టు తోఁచినది: కొమ్మలు రెండూమూఁడు యోజనముల దూరము వ్యాపించియున్నవి. చెట్టెంతయెత్తుండనోయని యాకాశము వంకఁజూచితిని గాని నాదృష్టి వ్యాపించి నంతవఱకుఁ కొన కనఁబడలేదు. పయివంక జూచుచుందఁగా నొక కాకి కొమ్మలలొఁ గూరుచుండి కావుమని కూసినది. ఉరుమువులెనున్న దానికూత వినఁబడఁ గానే నాగుండెలు పగిలొపోయినవి; దాని రూపమను జూచినను నాభయము తక్కూవకలేదు. అది రూపమునందు గేదెదూడంత యున్నది. దానినిజూచి యేపక్షీనన్నెగ నెత్తుకొనిపోవునోయని భయపడి ప్రాణరక్షణార్ధమయి యొక యూడచాటునకుఁ బోయితిని. ఆవంక చూడఁగానే యూడమీఁదఁబ్రాఁకుచు రెండు కండచీమలు నాకంటఁబడినవి. అవి మనదేశమునందలి ఎలుకలంతలేసి యున్నవి. అవి కుట్టిన పక్షమున యేనుఁగు వంటిదృధకాయుఁడు సహితము నిమిషము లో పీనుఁగగు టకు సందేహముండదు. శివ నాఙ్ఞ లేనిది చీమ కుట్టదన్న లోకో క్తి యధార్ధముగా నేను సమీపమునకుఁబోయినను నన్నోక చీమయు కుట్టలేదు. అయినను వానిదర్శనమువలన నైనభీతిచేతనే నా దేహమంతయు గాలిలోపెట్టిన దీపమువలె కంపింప మొదలు పెట్టినది. అప్పటి నాదురవస్ధ నేమని చెప్పుకోను! దుత్తూరపర్ణి పసరు కొంచె మక్కడ దొరకినపక్షమున మరల కాలికి రాచుకొని శీఘ్రముగా స్వదేశముచేరి ప్రాణరక్షణము చేసికోనలెనన్న బుద్ధి పుట్టినది. నే నేవైపునఁ జూడ్కినిగిడ్చినను దుత్తూరపర్ణి యొక్క మొక్కయి నను చుట్టుపట్ల నెక్కడను చూపు మేర దూరములో నాదృష్టికి గోచ రముగా లేదు. అప్పుడు మనపూర్వులు మహబుద్ధిమంతులయి దూర