పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము

చేతనో మఱియేహేతువు చేతనో వారి వేత్ర ప్రహారము లన్నియు నామీదనేకాని యల్లరి మూఁకమీఁద నొక్కటియు పడలేదు. కొంతసేపటికి నేను మూద్ఛిల్లితిని. రక్షకభటురాండ్రు నాకు శైత్యోపచారములు జేసి మూర్ఛతెలిసిన తరువాత నన్ను ధర్మవైద్యశాలకు బండి మీదగొనిపోయి యచ్చటి రాజకీయ వైద్యురాండ్ర కొప్పగించిరి. నే నిరువది దినములు వారిచికిత్సలో నన్ను తరువాతనేను లేచి భూమి మీఁద నడుగు పెట్టి కొంచెము తిరుగుట కారంభించితిని. రాజకీయోద్యోగిని లీదొమ్మిచేసిన వారిని పట్టుకొవలసిన దని రక్షక భటురాండ్రకాజ్ఞాపించినను, వారాదొమ్మి సమయమునందచ్చట నుండి భయము చేత కన్నులు మిరుమిట్లు గొని చూడలేనివారై నందున నొక్కరి నైనను పట్టుకోలేక పోయిరి. నేను వైద్యశాలలోనున్న దినములలో ప్రతిదినమును తప్పక ఫాంఢీభంగీగారు వచ్చి నన్ను చూచిపోవుచుండిరి. వైద్యశాలాధికారిణియు నాయందు పుత్రవాత్సల్యము కలదై నాపథ్య పానములను స్వయముగా విచారించుచు మంచిమందుల నిచ్చుచువచ్చెను. ఆకాలములో ఫాంఢీభంగీ తల్లిగారును రెండుమూడు పర్యాయములు వైద్యాశాలకు వచ్చి నాక్షేమమును విచారించుచు, ఒకనాఁడు నన్నుఁజూచి " నీవిట్లు కాని దేశములలో దిక్కుమాలిన పక్షివయి చచ్చుటకంటె సుఖముగా స్వదేశమునకుఁ బోయి హాయిగా నుండరాదా?" అని ప్రశ్నవేసెను. అప్పుడు మాయిరువురకు నిట్లు కొంత సంభాషణ జరిగింది._

"అమ్మా నాకును స్వదేశమునకుఁ బోయలెననియే యున్నది."

"ఉన్నయెడల శీఘ్రముగాఁబోరాదా?"

"పోవుటకు నాకు శక్తి లేదు. మాదేశమార్గము నేనెఱుఁగును."

"దారియెరుఁగకుండ మీదేశమునుండి మాదేశమునుండి మాదేశమున కెట్లు వచ్చితివి?"

"గురుప్రభావముచేత."