పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొందఱు నటించినను నిజముగా చేయువారుమాత్రమేలేరు. జననీజనకుల నిర్భంధమెక్కువయినప్పుడు బాలికలు తమకుమిధా చెప్పవలసినదని వారినడుగ మొదలుపెట్టఁగా వారు తమగుట్టు బయలపడకుండ మొట్టమొదట కోపపడియు తరువాత తమకు తీరికలేదనియునుపేక్షచేసి, చేయకపోయిననుపమిధా చేయుచున్నామని చెప్పి శోణమృత్తికాధారణమును మాత్రము చేసినచాలునని చెప్పిరి.మఱికొందఱుజనులు తాము మిధా నేర్చుకొనవలెనని పురోహితురాలిని పిలిపించియడిగిరి. పురోహితురాలును కొంచెముసేపాలోచించి తన నిమిత్తమై పల్లెయందున్న తనచెల్లెలు మిధాచేయుచున్నందున పట్టణములయందు వాడుకలోలేనిదానిని తాను నేర్చుకోవలసిన యావశ్యకము లేకపోయినదనియు, పట్టణములయందుప యుక్తమయున యర్ధశాస్త్రమును మాత్రమే తానభ్యసించితిననియు. తగినంతధనమిచ్చెడుపక్షమున పల్లెనుండి తనచెల్లెలిని పిలిపించెదననియు చెప్పెను. సూర్యకరతాపముచేత చెఱువులోనినీరింకినట్టే ధనముపేరుచెప్పఁగానే వారిమనోసరస్సునందూరిన మిధాభ్యాసాభిలాష ప్రవాహ మింకిపోవును.అర్ధశాస్త్రమనఁగా నేమోమీలోఁగొందఱికి తెలియకపోవచ్చును.అత్నీకులు మొదలయిన వారిచేత నోములు వ్రతములు మొదలయినవి చేయించివారివలన ధనమును గ్రహించెడిశాస్త్రమే యర్ధశాస్త్రము.

పురుష విధ్యాభ్యాసమున కాధారముగా గాధాయని చెప్పఁబడెడువారి వేదములయందు ప్రమాణమున్నదని నవనాగరికురాండ్రెక్క్డిసో యొక వచనమునుదీసికొనివచ్చిరి.మిధాకువలెనేగాధాకర్ధమేలేదనియు, ఉన్ననువేదము దేవభాషయగుటవలన దానియర్ధముదేవతలకేకాని మనుష్యులకు తెలియదనియు, అందుచేత పూర్వము పురుషవిధ్యగలదని వేదప్రమాణమును జూపినవారిమాట యంగీకార్యముకాదనియు,పుణ్యముకొఱకు వేదమంత్రముల నూరకకర్మలు