పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గానే యింతయాలస్య మేలచేసితిరనియడిగెను . ఆలస్య కారణమును మేము "స్వగయాత్ర"ను జూడబోవుటగా జెప్పితిమి. అందుమీద నతడాదినమున పాఠములకట్టిపెట్టి నిజముగా నది నరకయాత్ర కాని స్వర్గయాత్రకాదనియు, అటువంటి క్రూరకృత్యమును జనులు వివేకముకలిగి తమంత మానకపోయినను దొరతనమువాడు బలవంతయు గానైనను మాంప వలెననియు బహుదూరము చెప్పెను. ఈప్రసంగములో మనదేశాచారము సంగతికొడావచ్చినది. పురుషుల విష్యమయి యిట్లుచేయుట దారుణ కృత్యమయినను భర్తృమరణము సంభవించినప్పుడనుగమనముచేయుట పతివ్రతలైన భార్యలకు పరమధర్మ మనియు, ఈ దేశమునందువలె ముసలివాండ్రు మాత్రమేకాక యేడెనిమిది స్ంవత్సరముల బాలికలు సహితము భర్తలుపోయినప్పుడు పూర్వ కాలమునందు మాదేశాములో సహగమనము చేయువుండిరి రనియు మాదేశమున కన్య దేశీయులు ప్రభువులగుటాచేత వారీ సమాచారమును మాంపించి పాపము కట్టుకొనిరనియు చెప్పి సహగమన మహాత్మ్యమును బోధించితిని. భర్తలు మృతినొందినప్పుడు భార్యలు భర్తలచితిమీదనెక్కి నిమిషములో నగ్నిహోత్రజ్వాలల కాహుతులగుదురని నేను జెప్పినప్పుడ తతడది క్రూరకృత్య మనియు, దొరతనమువారు దానిని మాంపుట శ్లాఘ్యకార్యమే యనియు, తనదేశమునందు ప్రభుత్వమువారి కట్టిసాహసము లేకయున్నదనియు, మహావ్యసనముతో బలికెను. పురుషులను ప్రాణముతో బూడ్చిపెట్టెడు దురాచారమును మాంపుటయవస్యమని నేనాతనితో నేకీభవించినను, మనదేశపు స్ంగతిని మాత్రమతడు తిన్నగ నాలోచించలేదనియు శాస్త్రములున్నసంగతి యతడెఱుహడనియు భావించి మాది కేవలాచారము కాదనియు, ప్రత్యక్షశాస్త్రమనియు, ఈకలియుగములో పరమప్రమాణమయిన వరాశరస్మృతియందు