పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా దేశములోకూడ నలుఁడు భీముఁడు మొదలయినవారు పాకము చేయుటలో పూర్వకాలమునందు బహు సమథు౯లు.

అట్లయిన పక్షమున మాదేశమువలెనే మీదేశము పూర్వకాలమునందు మంచిదయియుండి యిప్పుడు చెడిపోయియుండును. స్త్రీలు బలహీనురాం డ్రగుటయే దేవుఁడు వారు౼

అందుకు సందేహములేదు. పూర్వకాలమందువలేఁగాక మా దేశమిప్పుడుతప్పక చెడిపోయినది.

స్త్రీలు బలహీనురాండ్రగుటయే దేవుఁడు వారు పనిపాటులు చేయనక్కఱలేక సుఖముగాకూర్చుండి యలోచనచేయుచూ ప్రభుత్వము చేయవలయునని యుద్దేశించెననుట నీకు నిదర్శనముగాఁ గనఁబడుచుండలేదా‽ ఇంతమాత్రము తెలిసికోలేని పక్షమున నీవు చదివిన చదువుతో నేమి ప్రయోజనము‽ ఇందుచేతనే పురుషు లొకవేళ చదివినను బుద్దిసంపదలో స్త్రీలతో సమానులు కాఁజాలరని మాపెద్దలు సెలవిఛ్ఛియున్నారు. ఇటువంటి మందబుద్దివగుట చేతనే బలవంతులయిన పురషులు బలహీనలయిన స్త్రీల కేల యడఁగియున్నారని నీకు సందేహము కలిగినది.

అవును. ఆ సందేహమును మీరు ముందుగాతీర్చి నన్ను ధన్యుని చేయవలెను.

స్త్రీలు బుద్దిబలముగలవారు. దేహబల మెంతయున్నను బుద్ది బలమునకు చాలదు. అందుచేతనే పురుషులు స్త్రీలకులోఁబడుట సంభవించినది.కేవల శరీరబలము గలవారయిన పురషులు బుద్దిబలము గలవారయిన స్త్రీలకు లోఁబడుట స్వభావముకాదా‽ ఈమాత్రపు స్వల్పాంశము నీకు తెలిసినదికాదు. ఇదే స్త్రీ బుద్దికిని పురుషబుద్దికిని గల తారతమ్యమ్యము . పురుషులు స్త్రీలకు లోఁబడియుండుట కింకొక రహస్యముకూడానున్నది.