పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నామీఁద నేమి నేరము మోపుదురో యని భయపడి వజవజ వడుగుచున్న నన్నుఁజూచి నన్నేదో ప్రశ్న వేసి నా వలన ప్రత్యుత్తరముగానక తనభటులనేమో యడిగి తెలిసికొని, నా యందు నిర్హేతుక జాయమాన కటాక్ష్యము గలవాఁడయి తనవెంట నన్ను తన యింటికిఁ దీసికొనిపొయెను. ఈశ్వరానుగ్రము చేత నేట్లు గారాగృహ విముక్తుఁడయి మంచి యింటఁ బడఁగలిగితిని. ఆతఁడు దయారసము గలవాడగుటచెత నన్నాదరించి, తనయింటిలో వీధివైపున నాకొకగది యిప్పించి, నాకు పరుండుట కాగదిలో మంచమెుకటి వేయించి, తన సేవకుని చేత భోజన పదార్థములు తెప్పించి నా ముందు పెట్టించెను. వారేజాతివారో తెలియకపొవుట చేత వారు తాఁకిన పదర్థములవు తినుటకు నేను మొట్టమొదట సంకోచించి తినిగాని, ఏదైనను సరే తినుమని యాఁకలి దేవత నా కడుపులో దూఱి నన్ను బాధించుట చేతను, ఆ దేశములో బ్రాహ్నణులున్నారన్న జాడయే లేకపోవుట చేతను, పూర్వకాలము నందాపత్సమయమున విశ్వమిత్రాదులు ఛండాల గృహమున శ్వమాంసాదులను దొంగలించి క్షుత్తు తీర్చుకొనుట పురాణములో చదివి యుండుట చేతను ఆత్మరక్షణము పరమధర్మమని మన శాస్త్రములు చేప్పియుండుట చేతను, స్వదేశము చేరిన తరువాత ప్రాయశ్చిత్తము చేయించుకొని బ్రాహ్మణ సంతర్పణము చేసి శూద్ధుఁడను కావచ్చునని నాటికి భోజనము చేసితిని. ఆ దినము నోటికి తిన్నగా మెతుకులు పోయినవి కావుగాని తరువాత క్రమక్రమముగా నలవాటు పడుటచేత మనుగడుపు పెండ్లి కొడుకువలె బోజనప్రియుఁడనై తేరబోజనములు చేయసాగితిని. మా గృహయజమాని పేరు "భాంఢీభంగీ!" అతడు బ్రహ్మణభక్తి చేతఁ గాకపొయినయి మంచిహృదయము గలవాఁడగుటచే నాకు సమస్తోపచారములును జరుగునట్లు చేసి, ఆరంభములో తమ భాషను నాకు స్వయముగనే నేర్పుచువచ్చెను. నేను గోడలు, మేడలు, ఉప్పు, పప్పు