పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

256

బండి తుత్తుకూడి చేరినది. బండివద్ద నిలుచుండ య్వ్ంతవెదకినను బ్రాహ్మణునిజాడ కానరాలేదు. బ్రాహ్మణు డెక్కడ తప్పిపోయినాడో, నన్ను గానక యెంత పరితపించుతున్నడో అని రెండుదినముల వరకును బండివచ్చినప్పడెల్ల మార్గస్ధులను పరీక్షించుచు పొగబండి దిగుచోటికివచ్చి చూచు చుంటిని. బ్రాహ్మణుడురాలేదు.ఆ బ్రాహ్మణుని మధురలో దొగలుకొట్టిరో అలస్యమగుటచేత బండితప్పిపోయెనో,మరియే ఆపదవచ్చెనో కాని బ్రాహ్మణుడు రాకుండెడు వాడుకాదు.అతనికి ద్రోహచింతయే యున్న పక్షమున రాత్రియెక్కడనో చీకటిలో దిగి పారిపోక, తెల్లవారి మధురదాక ఎందుకు వచ్చును? ఆధనము నాకు ధర్మార్ధముగా వచ్చినదే యయినందున పోయినసొమ్ము మరల రాదని నిరాశ కలిగినతరువాత దొంగలచేత పడక బ్రాహ్మణునిచేతిలో పడి సత్పాత్రదానఫలము నాకు లభించెనని సంతోషించితిని.
               ఈ బ్రాహ్మణుని నిమిత్తము నేనువెదకుచుండగా దైవికముగా నాకొకతెలుగు బ్రాహ్మణుడు కనబడి నాసంగతినివిని విచారపడి తన యింటికి తీసికొనిపోయి నాకాదినమున భోజనముపెట్టి, మరునాడు నన్ను తనబండిలో నెక్కించుకొని తీసికొనిపోయి కొన్నిదినములలో దక్షిణ మళయాళమునకు రాజధానియైన తిరువనంతపురమునకు చేర్చెను. ఆపట్టణములో నేను నెలదినము లుంటిని.ఆ పట్టణమును చేరినమరునాడే