పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆడుమళయాళము 253

నందున పులుసుతోనే యన్నముకలిపి మిరియాలుకంపుచేత రుచిగా లేకపోయినను కన్నులుమూసికొని నాలుగుముద్దలు మింగితిని.ఇంతలో వంటబ్రాహ్మణుడు పులుసుకుండయు,అన్నపుబిందెయు, వాకిటిలోనికి తీసికొనిపోయి యెవ్వరికో శూద్రూలకువడ్డించి మాకు వడ్డించుటకయి మరల తెచ్చెను. శూద్రులు చూచినయన్నము తినుటకునాకు మనసొప్పకపోయినను మా ద్వాదశిబ్రాహ్మణుడుమాత్రము మరల వడ్డించుకొని యాపులుసుతోనే తవ్వెడుబియ్యపన్నముతినెను.బిందెలో అన్నము మిక్కిలి తక్కువగానుండుటచూచి,అంతయన్నమును శూద్రులే తినిరాయని యడిగిరి.లేదు.మీరు స్నానమునకుపోయినప్పడు బ్రాహ్మణులకెపెట్టి వకచిన్నపంక్తిలేవదీస్తీ నని సత్రాధికారి చెప్పెను.ఆమాటలతో నామనసువిరిగి యేకాదశి నిరాహారఫలమంతయు వ్యర్ధమయ్యెనని నాకెంతో విచారము కలిగెను. ఆసంగతినే నేనాలోచించు కొనుచుండగా సత్రాధికారి రసము తెచ్చి మిరియాలువేసిన కాగీకాగని చింతపండునీళ్లు విస్తరిలో పోసెను.ఆభోజనసాఖ్యము చెప్పటకు శక్యముకాదు. నేనొకవేళ చెప్పినను దూరదేశములోనున్న మీరు పుర్ణముగా గ్రహింపలేకపోవచ్చును. కాబట్టి యెాచదువరులారా;నా సత్యసంధతను పరీక్షంచుటకయినను మీరోక్కసారి చెన్నపట్టణమునకువచ్చి, గృహసంఖ్యగల సుబ్బరామయ్యగారి అన్నసత్రములో ఒక్కపూట భోజనముచేసి, అనుభవైకవేద్యమయిన యాసాఖ్యము నొక్కసారి తప్పక యనుభవించుపొండు .నేనిప్పడు ముందుగా చెప్పచున్నాను. అన్నహితముపోయినదనిమాత్రము నన్ను తరువాత దూషింపబోకుడు. సత్యమును పరీక్షించువా రీలోకములో నెన్ని కష్టములనయినను పడవలెను.
                    భోజనముకాగానే నాకును మా బ్రాహ్మణునకును భోజనమున కియ్యవలసిన యెనిమిదణాలను నేనే యిచ్చివేసితిని.అదిగాక మాబ్రా