పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
214 రాజశేఖర చరిత్రము

సంభవించిన దురవస్థయంతయు ఁ జెప్పుకొంటిని.అతడు నాస్థితిని విని మిక్కిలి విచారపడి,సొమ్ము చేతనుంచియెడల పాధుచేయుదు నని యెఱిఁగి,యొకస్నేహితునకు జాబూవ్రాసి నన్నచెటికిఁబంపెను.నేనా యుత్తరమును దీసికొనిపోయి చూచినతోడనే యాతఁడు నన్ను మధ్యా హ్నమున రమ్మనిచెప్పి నాకు నెలకు పదిరూపాల జీతముగలపని నొకదాని నిచ్చెను.నేనాపనిలో రెండమాసము లుండువరకు నాకది యొంతో భారముగా కనఁబడెను.ఒంటరిగానున్నప్పుడు నాకంటఁబడిన వస్తువులనెల్లను హ స్తలాఘవమునుజూసి నేను మాయముచేయుచు వచ్చినందున,నాయజనఁడు వారిమీఁదనుపెట్టి వీరిమీదను పెట్టి నన్ను దిట్ట్టుచుండెను.అంతియకాక యెకరికి లోఁబడియుండి వారు చెప్పినటెల్ల పనిపాటలు చెయుట నాస్వభావమునకు సరిపడినదికాదు. నాకు స్వభావముగా మహారాజువలె నుండవలెనని యాశగనుక, ఆపనిని విడిచిపెట్టివచ్చి యింటివద్ద కాలిమీద కాలువేసుకొని కూరు చుండి నన్ను నమ్మినవారికడ నెల్లను ఋణములుచేయుచు,ఆప్పపుట్టి నంతకాలము సులభమూగా జీవనము చేయుచుంటిని .ఈప్రకారముగా నిరుద్యోగముగా జీవనముచేయుచున్న కాలములో నేనితరులు చేయు హితభోధ నెప్పుడును వినకపోయినను,అడుగుటయందు మాత్రము విశేషశ్రద్ద వుచ్చుకొని విశేషనీతివాక్యములనునేర్చుకొంటిని.ఆటుతరు వాతనానీతివాక్యములు నాకేమియుఁ బనికిరాకపోయినను ఇతరుల కై నఁ బనికివచ్చునని యెంచి మూఢులకు హితోపదేశములు చేసి గొప్ప వాఁడనని పేరుపడి ధనమార్జింప నారంభించితిని.అప్పుడుసహితము నానడత తిన్నగా నుండనందున నొకనాఁడొక భక్త్తుఁడువచ్చీ 'మీరిన్ని నీతులను జెప్పుచన్నారుగాని మీప్రవర్తనము తిన్నగానున్నదా?" యని నన్ను ఁబ్రశ్నచేసెను. 'నాకుఁబనికి రావనియేకదా యీనీతు