పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ీ::::రాజశేఖర చరిత్రము

వాలుపట్టి రుక్మిణిదని తెలుసుకొని 'నీకీకాసులపేరు నెక్కడనుండివచ్చే'నని వానిని ప్రశ్నలు వేసితిని. వాడు నేను వర్తకుడను కాఁబట్టి మా యూరిలో నొకనిచేత పట్టుతోకట్టించినా నని చెప్పెను. అందుమీఁద నేనాపేరుమాబంధువులదనిచిప్పి, 'యీదొంగసొత్తు నీయొద్దఁగనఁబడి వదిశాఁబట్టి నిన్ను రాజభటుల కొప్పగించెద ' నని బెదరించితిని. వాఁడును జడియక కాసులపేరు మాయొద్దనేదిగవిడిచి, ఠాణాకుఁబోయి మీరు చేసిన యక్రమమును జెప్పి 'మిమ్ములను బట్టుకొని శిక్షించుటకు బంట్రోతులను దీసుకొనివచ్చెద ' నని కేకలు వేయుచుఁబోయి, నేనచట రెండు దినములున్నను మరల రానేలేదు. మూఁడవ నాఁడు ప్రాతఃకాలముననే యొక కూలవాఁడు ధవిళేశ్వరమునుండి వచ్చి నారాయణమూర్తి గారు వ్రాసిన జాబు నొక దానిని నాచేతికి కిచ్చెను. నేను దానిని పుచ్చుకొని విప్పి చూచుకొనునప్పటికి "మీనాయన నేఁడే గృహము తగులపడి కాలముచేసినాఁడు కాబట్టి తక్షణము బయలుదేఱి రావలసినది" అని యందు వ్రాసి యుండెను. పిడుగువంటి యావార్త చూడగానే గుండెలు బద్దలయి లోపలికిఁబోయి యేడ్చుచు నాసవతితల్లి కాదుర్వార్తను వినిపించితిని; ఆ మాట విన్నతోడనే యామె నేలఁబడి కొప్పువిడిపోవ దొర్లుచుఱొమ్ముచరచుకొనుచు నిల్లెగిరిపోవునట్లు రోదనముచేయ నారంభిచెను. ఆ యేడువులను పెడబొబ్బలును కొంచెము చల్లారినతరువాత నామెకు ధైర్యము చెప్పి, ఆకూలివానివెంట నాపూటనే బయలుదేరి కాళ్ళు పొక్కు లెక్కునట్లుగా తెల్లవారినఁదాక నడిచి మరునాఁడు పగలు రెండు జాములవేళకు మాయిల్లు చేరితిని.అప్పుడాయింటికి గోడలుతప్ప మరి యేమియు లేవు. చుట్టుపట్ల నొకయిల్లయిన కాలక వింతగా మాయొక్క యిల్లు మాత్రము పరశురామప్రీతి యయినది. నేనక్కడ విలపించు