పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖరచరిత్రము

<poem>అని పాపయ్య కాగితము కలమును తెప్పించి యిచ్చెను తోడనే రాజశేఖరుండు గారు విజాఞన పత్రిక నొకదానిని వ్రాసిమడచి జిగురంటించిపయిని చిరునామవ్రాసి యియ్యంగ పాపయ్య యొక మనుష్యునిచేత దానినిరాజుగారి కంపెను. కాని యాయన యొద్దనుండి యొకయుత్తరముగాని విమర్శచేసివ్యయము దయచేయు సూచనులు గాని రేండూముడుదినములు కడచినను రాలేదు. రాజబంధువు మిదజేసిన విన్నపము గనుక బదులురాదని రాజశేఖరుండు గారూరకుండిరి.

సీతనేత్తుకు పోయిన మఱునాండు ప్రొద్దుననే రాజుగారు చెఱసాలను జూచుటకు వత్తురని యచట నొక వదంతి కలిగెను, తరువాత గొంచేము సేపటికి రామరాజురాజశేఖరుండు గారున్న తావునకు వచ్చెను.

రాజ--రామరాజుగారు! నాతప్పునుక్ షమింపవలెను. మిరారాత్రి జాబును తెచ్చియిచ్చుటయే నాకు మహొపకార మయినది. నేనుసంగతిని తెలుసు కోలేక మిమ్ము నిష్కారముగా కానిమాట లాడినాడను.

రామ--మికు నేను జేసి యున్న యుపకారము నకు నన్నటువంటి మాటలన వలసినదే. ఇంకనెప్పుడును మేలుచేయకుండ మంచి బుద్ధి చెప్పినారు.

రాజ--నాయందు కరుణించి మిరాసంగతిని మఱచి పోవలెను. మంచి సంబంధము చెడిపొయెగదా యని యానమయములో నొడలుతెలియక యేమోయన్నాను. నన్నుమన్నింపుండు,

రామ--రాజుగారు చెఱసాలను చూడబయలుదెఱినారంట. నేను వేగిరము పోవలెను.

అని రామరాజు వెళ్ళిపోయెను. తరువాత రెండుగడియలకు వెండిబిళ్ళ బంటొకండువచ్చి రాజుగారు కొలువుతీర్చి కూరుచుండి,<poem>