పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పండ్రెండవప్రకరణము

సుబ్బ-వెంకటేశ్వరులకు మొక్కుకున్నది. ఆమొక్కును బట్టియే తొడుగుకొన్న యంగీ మొదలగు వస్త్రములను భోజనము చేయునప్పుడు సహితము తీయకుందును; బట్టలు మాసినప్పుడు సహితము రెండవ వారెఱుగకుండ మహారహస్యముగా నొకగదిలో నుతికినబట్టలను కట్టుకొనుచుందును. ఈవ్రతము నేటివఱకు దైవాను గ్రహము వలనసాగివచ్చుచున్నది.

రామ-ఈవ్రతము మిక్కిలి చిత్రముగానున్నది. ఇటువంటి వ్రతము నేనీవఱకుకనియు నెఱుఁగను .ఈవిధముగా మాటలు చెప్పుకొనుచు వారుదీపములు పెట్టిననాలుగు గడియలకు భీమవరమునకు సమీపముననున్నయొకచిన్నపల్లెను జేరిరి: అక్కడనుండి త్రోవ మంచిది కాకపోవుట చేతను, రెండు దినముల క్రిందట వాయూరిబయటనే పెద్దపులి యొకమనుష్యుని నెత్తుకొని పోయినదని వినుటచేతను, చీకటిలోవారిని నడిపించుకొని పోవుటయుక్తము గాదని రామరాజువారి నాగ్రామములో నొక కాపువాని యింటఁ పరుండబెట్టెను. ఆపల్లెలో బ్రాహ్మణులులేరు. గనుక వారాత్రిభోజనము చేయక పోయినను, రామరాజు కోమటి యింటికివెళ్ళి యటుకులనుదెచ్చి పరున్న యింటివాండ్రకు పాడియాటచేత చెంబెడు చిక్కని మజ్జిగ యడిగి పుచ్చుకొని వారికిద్దఱికిని బెట్టెను. వానితోక్షుత్తుని వారణమైనందున వారును బసవాండ్రిచ్చిన తుంగచాపమీద పడుకొనిహాయిగానిద్రపోయిరి. రామరాజు జామురాత్రియుండగానే వారిని లేపితనతోఁగూడ దీసికొని యలుదేఱి రెండుగడియలలో భీమవరముచేర్చి, యూరి బయటకు రాఁగానే తానావరకు మఱచి పోయిన గొప్పసంగతి యేదో తనకప్పడ కస్మాత్తుగాజ్ఞప్తికివచ్చినట్టు నటించి తొందరపడి తనకఁవెంటనే వెళ్ళక