పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండ్రెండవ ప్రకరణము

రామరాజుసాయమున::సుబ్బరాయఁడు::సీతవెంటఁబెట్టుకొని
వచ్చుట.రామరాజు:చెఱసాలలో::రాజశేఖరుఁడుగారినిచూచుట.రాజ
శేఖరుడుగారికారాబ౦ధనిమొచనము-శోభనాద్రిరాజునుశిక్షిం
చుట.సుబ్బరాయఁడురుక్మిణీయయితనవృత్తాంతమునుచెప్పుట.
 

పెద్దాపురమునకు అయిదారు క్రోనులదూరములో జగ్గమపేటయను గ్రామమొకటికలదు. సీతనెత్తుకొని పోయిననాఁడు మధ్యాహ్నము రెండుజాముల వేళ గ్రామ కరణముయొక్క యింటివద్ద కెవ్వరోవచ్చి తలుపు తీయుమని కేకలువేసిరి. అప్పుడు పదునాలుగు నంవత్సరముల ప్రాయము గలిగిన మిక్కిలి యందగాడై యేహేతువుచేతనో తలపెంచుకొనియున్న చిన్నవాడొకడు లోపలినుండివచ్చి తలుపుతీసి యెందుకువచ్చి నారనియడిగెను. అక్కడ నిలుచుండి యున్నయిద్దఱుమనుష్యులలో నొకడుబ్రాహ్మణకన్యకు డబ్బుపుచ్చుకొని యన్నముపెట్టెదరా? యనియడిగెను. ఆచిన్నవాడు వెలుపలికివచ్చి చూచునప్పటికి, యెనిమిదేండ్లయీడుగల యొకచిన్నది యరుగుమీద గూరుచుండి క్రింద చూచుచు వెక్కివెక్కి యేడ్చుచుండెను. ఆమనుష్యులలో నొకడుచేరువ నిలుచుండి యూరకుండుమని యదలించుచుండెను. ఆచిన్నవాడట్లు వెలుపలికివచ్చి తమమొగము వంకదేఱిపాఱచూచుచుండుట గని ఆమనుష్యులిద్దఱును మీపేరేమనియడిగిరి. అతడు సుబ్బరాయుడనిచెప్పి, యాచిన్నదాని మొగమును నిదానించి కొంచెముసేపుచూచి యిట్లనెను.

సుబ్బ---ఈచిన్నదియెవరు? మీరెక్కడనుండి తీసికొని వచ్చినారు? ఎక్కడకుతీసికొని పోయెదరు?