పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
తొమ్మిదవ ప్రకరణము

అని చదివిన తరువాత, యంత్రఙఁడు వీడువిస్తళ్ళను వీడుచోట్ల వేయించి ఆయేడింట్లలోను కుభము పోయించి, బండితోలుకొనివచ్చిన వానిచేత నల్లకోడి నొకదానిని కోయించి దానిర క్తమును కుంభము మీఁద పోయించి,"ఓగ్రహమా! నీకుంభము పుచ్చుకొని కొండల మీఁదికి పో" అని యాజ్ఞాపించెను. అక్కడకు వెళ్ళిన వారందఱును చెఱువులో స్నానముచేసి యిండ్లకు వెళ్లిరి. సుబ్రహ్మణ్యమును బ్రాహ్మణునితో సత్రమునకు వచ్చెను.

ఇంటికివచ్చి సుబ్ర్ష్మణ్య మాసంగతి యంతయుఁ జెప్పినతరువాత రాజశేఖరుఁడుగారు కొంతసేపు జనుల మూఢత్వమును గుఱించియాలోచించి, ఇంతలో రుక్మిణి తలపునబాఱిన దుఃఖమువచ్చి ధైర్యము తెచ్చుకొవలెనని యెంతసేపు ప్రయత్నము చేసినను చేతఁగాక ఎక్కడకయిన వెళ్ళిన దుఃఖము మఱచిపోవచ్చునని తలంచి పట్టణమును జూచుటకు బయలుదేఱిరి. అతఁడు సత్రమునుదాఁటి నాలుగడుగులు నడచినతోడన యొక యింటివద్ద దంపతులిద్దఱు వాక్కలహామున కారంభించిరి; అంతకంత కాకలహము ముదిరి యొకరీతి యుద్ధము క్రింద మాఱినది భార్య తిట్లెక్కువ చేసినకొలఁది భర్త దెబ్బలెక్కువ చేయుచుండెను. మగని కేకలును భార్య యేడుపును విని వీధివారందఱును గుంపులు గుంపులుగా చూడవచ్చిరి. అంతమంది వచ్చినను వారిలో నొకరును వారిని వారింపనలెనని తలఁచుకొని వచ్చినవారు లేరు గనుక, అందఱును వేడుక చూచుచు మాత్రము నిలుచుండిరి. అంత రాజశేఖరుఁడుగా రాస్థలమును విడిచిపెట్టి ముందుకు సాగిరి. ఆవల మఱి నూరుబారల దూరము వెళ్ళఁగా ఒకచోట వీధియరుగు మీఁద పదిమంది పెద్దమనుష్యులుచేరి సభతీఱి కూరుచుండిరి. వారు నాగరికులు గనుక వారిప్రసంగ మెంత మనోహరముగ నుండునో విని